హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ట్విటర్‌లో సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ పేరు ట్రెండ్ అవుతోంది. సారా టెండూల్కర్ తమ్ముడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. తండ్రి మెంటార్‌గా ఆ జట్టుకు సేవలందిస్తున్నాడు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో నెటిజన్లు సారా టెండూల్కర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గిల్ అద్భుతంగా ఆడినప్పుడల్లా సారా పేరు నెట్టింట వినిపించేది. గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం కాస్త తగ్గినా.. ఐపీఎల్ పుణ్యమా మళ్లీ మొదలైంది.

గిల్-సారా టెండూల్కర్ మధ్య బ్రేక్ అప్ అయిందని, గుజరాత్ బ్యాటర్ సారా అలీఖాన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్ పేరు కొన్నాళ్లు వినబడలేదు. కానీ తాజా మ్యాచ్‌తో గిల్- అర్జున్-సారాలతో కూడిన ఫొటోలతో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
బావ-బామ్మర్దుల సమరం.. మధ్యలో సారా టెండూల్కర్ నలిగిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేయగా.. సారా సంతోషానికి హద్దే లేకుండా పోయిందని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ్ముడికి, అటు ప్రియుడికి ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక సారా సతమతమవుతుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ మిల్లర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), అభినవ్ మనోహర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రాహుల్ తేవాడియా(5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రాండార్ఫ్, రిలే మెరిడిత్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.