Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే హృతిక్‌ను పక్కనపెట్టి మురుగన్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ

Rohit Sharma Says M Ashwin in place of Hrithik

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ కండీషన్స్ బట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. అంతేకాకుండా చేజింగ్ తమకు అచ్చొచ్చిన ఫార్మూలా అని, ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తర్వాత ప్రయోగాలు చేస్తామని చెప్పాడు. బౌలర్లు రాణించినట్లు బ్యాటర్లు రాణించలేకపోతున్నారని, రానున్న మ్యాచ్‌ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని హార్దిక్ తెలిపాడు.

ఇక తమ జట్టులో ఒకే ఒక మార్పు చేశామని ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తెలిపాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగా హృతిక్ స్థానంలో మురుగన్ అశ్విన్‌ను తీసుకొచ్చామన్నాడు. ఈ సీజన్ తమకు కఠినంగా సాగిందని, కనీసం ముగింపునైనా ఘనంగా చేయాలనుకుంటున్నామని తెలిపాడు. పెద్దగా ఒత్తిడి తీసుకుంటలేమని, ఆటను ఆస్వాదించాలనుకుంటున్నామని చెప్పాడు. ఫస్టాఫ్‌లో అనవసర ఒత్తిడికి గురై మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు.

గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడామని, అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తామంతా ఫ్రొఫెషనల్ క్రికెటర్లమని చెప్పిన రోహిత్.. ఒడిదొడుకులు ఉండటం సహజమని చెప్పాడు. నిలకడగా ఆడటంపై ఫోకస్ పెట్టామని, ఈ రోజు సాయశక్తులా విజయం కోసం కృషిచేస్తామని తెలిపాడు.

గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయాన్నందుకుంది. అయితే గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌పై గెలుపొందిన ముంబై.. అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది.

తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

Story first published: Friday, May 6, 2022, 19:23 [IST]
Other articles published on May 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+