Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: పాపం రోహిత్.. రివర్స్ స్వీప్ మిస్ ఫైర్.. తాకరాని చోట తాకిన బంతి!

GT vs MI: Rohit Sharmas Reverse Sweep Against Gujarat Titans Makes Twitterverse Go Crazy

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో తన బ్యాటింగ్ వైఫల్యానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న హిట్‌మ్యాన్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. సూపర్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. రివర్స్ స్వీప్ ఆడటంలో విఫలమైన రోహిత్ శర్మ మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి రోహిత్‌ ప్రైవేట్ పార్ట్ దగ్గర బలంగా తాకింది. నొప్పితో హిట్ మ్యాన్ విలవిలడాడు. ఎల్బీ కోసం గుజరాత్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. రివ్యూ తీసుకున్న హార్దిక్ ఫలితం రాబట్టాడు.

రషీద్ ఖాన్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రషీద్ ఖాన్ వేసిన మూడో బంతిని హిట్ మ్యాన్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి అతని బ్యాట్‌ను మిస్సై హిట్ మ్యాన్ రహస్య ప్రదేశంలో బలంగా తాకింది. రోహిత్ లెగ్ బాగా స్ట్రెచ్ చేయడంతో గుజరాత్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వకపోవడంతో రివ్యూకి వెళ్లగా.. బ్యాట్‌ను మిస్సైన బంతి అల్ట్రా ఎడ్జ్‌లో వికెట్లను గిరాటేసింది. దాంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్ పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై.. 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో 9 పరుగులను కాపాడుకొని థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను గుజరాత్ అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ మ్యాచ్‌ను ములపుతిప్పింది.

Story first published: Friday, May 6, 2022, 23:36 [IST]
Other articles published on May 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+