Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: కొంపముంచిన తెలుగోడు.. ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 36 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ చెలరేగితే.. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్(2/34), ప్రసిధ్ కృష్ణ(2/18) సత్తా చాటారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), జోస్ బట్లర్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/29) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మా న్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీసారు.

GT vs MI IPL 2025 Mohammed Siraj and Prasidh Krishna helps Gujarat beat Mumbai

అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 48), తిలక్ వర్మ(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39)మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు.

పేస్ బౌలింగ్‌కు అనుకూలగా ఉన్న వికెట్‌పై ముంబై ఇండియన్స్ యువ పేసర్, తెలుగు తేజం సత్యనారయణ రాజు(1/40) ధారళంగా పరుగులిచ్చాడు. ఓవర్‌కు 13.33 చొప్పున పరుగులివ్వడంతో గుజరాత్ టైటాన్స్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సత్యనారయణతో పాటు ముంబై ప్రధాన బ్యాటర్ల వైఫల్యం ఓటమికి ప్రధాన కారణమైంది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిరాజే.. ముంబై కీలక బ్యాటర్లను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. మిడిల్ ఓవర్లలో ప్రసిధ్ కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్‌ కూడా ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Saturday, March 29, 2025, 23:50 [IST]
Other articles published on Mar 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+