Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ ప్రభావంతో పాటు ఈ పిచ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. గతేడాది మేం ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడాం. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడినా.. విజయాన్ని అందుకోలేకపోయాం. ఈ మ్యాచ్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం.

కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. జట్టులో ఒకరికొకరం మద్దతు ఇచ్చుకుంటూ అండగా నిలుస్తున్నాం. రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఆటను ఆస్వాదిస్తూ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేసే ప్రయత్నం చేస్తాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. హార్దిక్ పాండ్యా రాకతో విల్ జాక్స్‌పై వేటు పడింది.

GT vs MI IPL 2025 Hardik Pandya reveals the reason why he choose bowl first
Photo Credit: IPL twitter (X)

మరోవైపు ఇక్కడ ఎన్నోసార్లు తాము ముందుగా బ్యాటింగ్ చేశామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ముందు బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా తమ ప్రదర్శనలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పాడు. పరిస్థితులను అందిపుచ్చుకొని సరైన లక్ష్యాన్ని నమోదు చేస్తే విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే.. లక్ష్యానికి తగ్గట్లు ఆడితే సరిపోతుందన్నాడు. గత మ్యాచ్‌లో ఓడినా.. అనేక సానుకూలంశాలు లభించాయన్నాడు. 'గత మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో మేం కాస్త తడబడ్డాం. అయినా 14 ఓవర్లలోనే 200 పరుగులు చేశాం.

మేం ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మార్పు జరగవచ్చు. మా బ్యాటింగ్ లైనప్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌ ఉండాలనుకుంటున్నాం. అందుకే జోస్ బట్లర్ నంబర్ 3లో ఆడుతున్నాడు. అతను ఇంగ్లండ్ తరఫున కూడా ఫస్ట్ డౌన్‌లోనే ఆడుతాడు. కాబట్టి అతనికి ఈ స్థానంలో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు.

Story first published: Saturday, March 29, 2025, 19:32 [IST]
Other articles published on Mar 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+