For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs MI: వారెవ్వా వాటే క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ నమన్ ధిర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నమన్ ధిర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ డైవ్ సెన్సేషనల్ క్యాచ్‌కు గుజరాత్ టైటాన్స్ బిగ్ హిట్టర్ రాహుల్ తెవాటియా నిరాశగా పెవిలియన్ చేరాడు.

ముంబై బౌలర్ గెరాల్డ్ కోయిట్జీ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ తొలి బంతిని కోయిట్జీ లో-ఫుల్ టాస్‌గా వేయగా.. తెవాటియా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ కింది భాగంలో తాకిన బంతి గాల్లోకి లేచింది. డీప్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న నమన్ ధిర్ అద్భుతంగా ముందుకు పరుగెత్తి సూపర్ డైవ్‌తో అసాధారణమైన రీతిలో బంతిని అందుకున్నాడు.

GT vs MI IPL 2024 Naman Dhir takes a splendid catch to dismiss Rahul Tewatia

అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకిందా? అని టీవీ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించాడు. చివరకు బంతి కింద నమన్ ధిర్ చేతులు ఉన్నాయని గుర్తించి ఔటిచ్చాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వారెవ్వా వాటే క్యాచ్.. పోలా అదిరిపోలా! అని కామెంట్ చేస్తున్నారు.

ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో డేంజరస్ తెవాటియా పెవిలియన్ చేరాడు. లేకుంటే అతను ఈజీగా మరో 10-15 పరుగులు రాబట్టేవాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్(39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45), శుభ్‌మన్ గిల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో రాహుల్ తెవాటియా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, March 24, 2024, 22:09 [IST]
Other articles published on Mar 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+