Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: బుమ్రా X పాండ్యా.. బయటపడ్డ విభేదాలు!( వీడియో)

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య ఉన్న విభేదాలు బయట పడ్డాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఫీల్డ్ సెటప్ విషయంలో హార్దిక్ పాండ్యా సూచనలను జస్‌ప్రీత్ బుమ్రా పట్టించుకోలేదు.

ఫీల్డింగ్ మారుస్తానని చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో రోహిత్ శర్మ జోక్యం చేసుకున్నాడు. రోహిత్ ఎంట్రీతో అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

GT vs MI IPL 2024 Jasprit Bumrah refused Hardik Pandya advice Video Goes Viral

ఫీల్డ్ మార్పు సూచనలను పట్టించుకోని రోహిత్ శర్మపై హార్దిక్ పాండ్యా గట్టిగా అరిచాడు. అతని అరుపులకు నిర్ఘాంతపోయిన రోహిత్ శర్మ.. చేసేదేం లేక కెప్టెన్ సూచించిన ఫీల్డ్ పొజిషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఫీల్డర్లపై ఎక్కువగా అరవడం చూసిన అభిమానులు.. తాజా వీడియో చూసి ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడని కామెంట్ చేస్తున్నారు. ఫీల్డింగ్ విషయంలో తన సూచనలను పట్టించుకోని ఆటగాళ్లను రోహిత్ శర్మ గట్టిగా మందలించిన వీడియోలు చాలా వరకు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు అతను కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవడం చూసి ఫ్యాన్స్ అయ్యో పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు.

గత సీజన్‌ వరకు గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఈ సీజన్ మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అతనికి ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా అసంతృప్తిగా ఉన్నారు. అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

తొలి మ్యాచ్‌లోనే బుమ్రా నిప్పులు చెరిగాడు. (3/15) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.

Story first published: Sunday, March 24, 2024, 22:49 [IST]
Other articles published on Mar 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+