Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. తేలిపోయిన గుజరాత్! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నమోదు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్(39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45), శుభ్‌మన్ గిల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో రాహుల్ తెవాటియా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

Jasprit Bumrah magic restricts

బుమ్రా బుల్లెట్ యార్కర్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ వృద్దిమాన్ సాహా(19)ను జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌తో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగులే చేసింది.

పవర్ ప్లే అనంతరం శుభ్‌మన్ గిల్‌(31)ను పియూష్ చావ్లా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌తో కలిసి సాయి సుదర్శన్ ఆచితూచి ఆడాడు. 40 పరుగుల భాగస్వామ్యంతో సెట్ అయిన ఈ జోడీని కోయిట్జీ విడదీసాడు. ఒమర్జాయ్(17)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే జస్‌ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చాడు.

నమాన్ ధిర్ స్టన్నింగ్ క్యాచ్..
బంతి వ్యవధిలో డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్‌లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ తెవాటియా బౌండరీలతో జోరు కనబర్చాడు. లూక్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా ఓ సిక్సర్‌తో పాటు రెండు బౌండరీలతో 19 పరుగులు పిండుకున్నాడు.

19వ ఓవర్‌ను బుమ్రా కట్టడిగా వేయగా.. ఆఖరి ఓవర్‌ తొలి బంతికే నమాన్ ధిర్ స్టన్నింగ్ క్యాచ్‌కు తెవాటియా వెనుదిరిగాడు. తర్వాతి ఐదు బంతుల్లో కోయిట్జీ 7 పరుగులు మాత్రమే ఇవ్వడంతో గుజరాత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Sunday, March 24, 2024, 21:25 [IST]
Other articles published on Mar 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+