Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: అందుకే అర్జున్ టెండూల్కర్‌ను తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి మంచి పిచ్‌లా కనిపిస్తోంది. డ్యూ వస్తే సెకండ్ బ్యాటింగ్‌‌కు అడ్వాంటేజ్ లభిస్తోంది. గుజరాత్ నేను పుట్టిన రాష్ట్రం. ఇక్కడ నేను ఎంతో సక్సెస్ సాధించాను. ఇక్కడి ప్రజల అభిమానం కూడా ప్రత్యేకం. అయితే.. క్రికెటర్‌గా నాకు అవకాశం ఇచ్చింది మాత్రం ముంబై.

GT vs MI IPL 2024 Hardik Pandya Reveals The Reason Why Arjun Tendulkar Not Playing vs Gujarat

సొంత జట్టులోకి తిరిగిరావడం సంతోషంగా ఉంది. మా ప్రాక్టీస్ క్యాంప్ మొదలై రెండు వారాలు అవుతోంది. మేం అద్భుతమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశాం. ఈ సీజన్ కోసం జట్టులోని ఆటగాళ్లంతా ఉత్సహంగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మేం నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లతో బరిలోకి దిగుతున్నాం.

అన్ని విభాగాలు రాణిస్తాయని ఆశిస్తున్నా.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక గాయంతో జట్టుకు దూరమైన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో నమాన్ ధీర్‌కు అవకాశం ఇచ్చారు.

మరోవైపు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం చాలా ఉత్సాహంగా ఉందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మరీ ముఖ్యంగా తాను ఎంతో సక్సెస్ సాధించిన నరేంద్రమోదీ స్టేడియంలో కెప్టెన్సీ చేయడం కొత్త అనుభూతి ఇస్తోందని చెప్పుకొచ్చాడు. గత రెండు సీజన్లుగా తమకు అసాధారణ రీతిలో మద్దతు లభించిందని గుర్తు చేసుకున్నాడు.

ఈ సీజన్ కోసం తమ జట్టు అన్ని విధాల సిద్దమైందని, కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడమని చెప్పాడు. జట్టులో ప్రతీ ఒక్కరు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని తెలిపాడు. ఈ మ్యాచ్‌తో తమ జట్టు తరఫున ముగ్గురు అరంగేట్రం చేస్తున్నారని, ఉమేశ్ భాయ్, స్పెన్సర్, ఒమర్జాయ్ బరిలోకి దిగుతున్నారని తెలిపాడు. అండర్ 19 సెన్సేషన్ సుశాంత్‌‌కు కూడా అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), వృద్దిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, షామ్స్ ములాని, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా, లూక్ వుడ్

Story first published: Sunday, March 24, 2024, 19:40 [IST]
Other articles published on Mar 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+