Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే జోఫ్రా ఆర్చర్‌ను పక్కనపెట్టాం: రోహిత్ శర్మ

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై బాగా నీళ్లు చల్లారని, వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

పిచ్‌పై మాయిశ్చర్ ఉన్న నేపథ్యంలో సరైన ఆరంభం అందుకోవడం ముఖ్యమని చెప్పాడు. పంజాబ్‌తో ఓటమిపై స్పందిస్తూ.. ఇలాంటి మ్యాచ్‌లు ఎదురవ్వడం సహజమేనని తెలిపాడు. అనవసర తప్పిదాలతో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నామని, ఆ తప్పిదాలను సవరించుకున్నామని చెప్పాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలి?, తదుపరి మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రణాళికలతో ఆడాలనేదే చాలా ముఖ్యమన్నాడు.

Rohit Sharma

ఈ మ్యాచ్‌కు అన్ని విధాల సిద్దమయ్యామని చెప్పిన రోహిత్.. మళ్లీ విజయాల బాట పడుతామని తెలిపాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన రోహిత్ హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తీకేయ జట్టులోకి వచ్చాడని, జోఫ్రా ఆర్చర్ స్థానంలో రిలే మెరిడిత్ ఆడుతున్నాడని చెప్పాడు.
జోఫ్రా ఆర్చర్ ఫిట్‌గా లేకపోవడంతోనే అతన్ని పక్కనపెట్టామని రోహిత్ స్పష్టం చేశాడు.

పిచ్ బాగుందని, నీళ్లు ఎక్కువగా చల్లారని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో గత మ్యాచ్‌లో విజయాన్నందుకోవడంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో లక్నో 36 ఓవర్ల పాటు ఆధిపత్యం చెలాయించిందని, అయినా తమ ఆటగాళ్లు విజయం కోసం ఆఖరి వరకు పోరాడారని చెప్పాడు.

లక్ కూడా కలిసి రావడంతో విజయం వరించిందన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నామని పాండ్యా స్పష్టం చేశాడు.

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, నెహాల్ వాదేరా, కుమార్ కార్తీకేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరిడిత్, పియూష్ చావ్లా, జాసన్ బెహెండార్ఫ్.

Story first published: Tuesday, April 25, 2023, 19:27 [IST]
Other articles published on Apr 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+