Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI: అన్నను చిత్తుగా ఓడించాడు.. ఇక తమ్ముడి పరిస్థితి ఏందో?

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2023 సీజన్‌లో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా నేటి రాత్రి 7.30 గంటలకు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టేబుల్ టాపర్‌గా గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరగా.. చేరుతుందో లేదో అనే సందేహాల మధ్య ముంబై దూసుకొచ్చింది.

కానీ ప్లేఆఫ్స్‌లో ఇరు జట్లకు భిన్న ఫలితాలు ఎదరయ్యాయి. లీగ్ దశలో 10 విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ చెన్నై చేతిలో ఓడగా.. ఎనిమిది విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబై ఎలిమినేటర్‌లో లక్నోపై అద్భుత విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా బ్రదర్ కృనాల్ పాండ్యాకు దిమ్మతిరిగే షాకిచ్చిన రోహిత్ శర్మ.. అదే జోరులో తమ్ముడికి కూడా ఓడిస్తాడా? లేక ఓటమికి తలవంచుతాడా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Rohit Sharma, Hardik Pandya

బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. మరి ముంబై ఏడో సారి ఫైనల్ చేరుతుందా? లేదా గుజరాత్ టైటాన్స్‌ వరుసగా రెండో సారి టైటిల్ ఫైట్‌కు సిద్దమవుతుందా? అనేది చూడాలి.

పటిష్టంగా ముంబై
వరుస పరాజయాలతో ఈ సీజన్‌ను ప్రారంభించిన ముంబై అనంతరం సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు దూసుకొచ్చింది. సీనియర్లు విఫలమైనా యువ ఆటగాళ్లు సత్తా చాటడం.. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడం ముంబైకి కలిసొచ్చింది. చెత్త బౌలింగ్‌తో ఇబ్బంది పడిన ముంబైకి యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్ ఊపిరి అందించాడు. సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థుల పతనాన్ని శాసిస్తున్నాడు.

కామెరూన్ గ్రీన్ సూపర్ బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తిలక్ వర్మతో పాటు ఆఖర్లో నేహాల్‌ వధెరా కూడా రాణిస్తున్నాడు. ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కట్టడి చేయడం గుజరాత్‌ బౌలింగ్‌ దళానికి సవాలే. ఏ ముగ్గురు చెలరేగినా గుజరాత్‌కు ఇబ్బందులు తప్పవు.

బ్యాటింగ్‌లో చెలరేగితేనే..
లీగ్‌ దశను గొప్పగా ముగించిన గుజరాత్‌ తొలి క్వాలిఫయర్‌లో ఊహించని పరాజయాన్ని ఎదురుకుంది. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. లోపాలు సరిదిద్దుకుని ఫైనల్‌ చేరడానికి రెండో అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే పట్టుదలతో టైటాన్స్‌ బరిలోకి దిగుతోంది. శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. విజయ్ శంకర్ పర్వాలేదనిపిస్తున్నాడు. వీరికి సాహా, హార్దిక్ పాండ్యా తోడైతే.. చివర్లో మిల్లర్, తెవాటియా మెరుపులు మెరిపిస్తారు.

బౌలింగ్‌లో పేసర్‌ మహమ్మద్ షమితో పాటు అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ నిలకడగా రాణిస్తున్నారు. యశ్ దయాల్ స్థానంలో గత మ్యాచ్‌లో ఆడిన దర్శన్ దారుణంగా విఫలమయ్యాడు. మోహిత్ శర్మ పర్వాలేదనిపిస్తున్నాడు. సొంతగడ్డపై మ్యాచ్‌ జరుగుతుండటం గుజరాత్‌కుకలిసొచ్చే అంశం.

పిచ్‌ రిపోర్ట్..
అహ్మబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి పేస్‌, బౌన్స్‌ లభించే పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు జరిగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు చేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశముంది. చేజింగ్‌లో మంచు ప్రభావం పెద్దగా ఉండకుండా కెమికల్స్ ఉపయోగిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

తుది జట్లు (అంచనా):

ముంబై ఇండియన్స్‌: ఇషాన్‌, రోహిత్‌ శర్మ, కామెరూన్ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, షోకీన్‌/నేహాల్‌, జోర్డాన్‌, చావ్లా, బెరెన్‌డార్ఫ్‌, ఆకాశ్‌

గుజరాత్‌ టైటాన్స్‌: శుభ్‌మన్‌, సాహా, హార్దిక్‌, విజయ్‌ శంకర్‌, మిల్లర్‌, సుదర్శన్‌/అభినవ్‌ మనోహర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ, మహమ్మద్ షమీ

Story first published: Friday, May 26, 2023, 7:59 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+