Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే హార్దిక్ పాండ్యా ఆడటం లేదు: రషీద్ ఖాన్

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. దాంతో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా కాస్త అస్వస్థతకు గురయ్యాడని టాస్ సందర్భంగా రషీద్ ఖాన్ తెలిపాడు.

అతన్ని ఆడించి రిస్క్ చేయవద్దని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించిందని చెప్పాడు. దాంతోనే హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. జట్టుగా సమష్టి ప్రదర్శన చేస్తూ గుడ్ క్రికెట్ ఆడుతామని, బ్యాటింగ్‌లో రాణించి భారీ స్కోర్‌ను ప్రత్యర్థి ముందు ఉంచుతామని తెలిపాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

Rashid Khan says ‘Hardik Pandya unwell slightly

కేకేఆర్ టీమ్‌లోనూ స్వల్ప మార్పులు జరిగాయి. టీమ్ సౌథీ స్థానంలో లూకీ ఫెర్గూసన్ రాగా.. మన్‌దీప్ సింగ్ స్థానంలో జగదీషన్ బరిలోకి దిగాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా అన్నాడు. పిచ్ కండిషన్స్, వాతావరణ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు. చేజింగ్ కంటే డిఫెండింగ్ తమకు సులవని, సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు వికెట్ అనుకూలంగా ఉంటుందని తెలిపాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కింది. వృద్ది మాన్ సాహా(17) ఔటైనా.. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ నిలకడగా ఆడుతుండటంతో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

తుది జట్లు:

కేకేఆర్: రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఎన్ జగదీషన్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తీ

గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్(కెప్టెన్), మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్

Story first published: Sunday, April 9, 2023, 16:30 [IST]
Other articles published on Apr 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+