తుది జట్టులో చోటు ఎలా..?
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 4 పరుగులు మాత్రమే చేసిన దారుణంగా విఫలమైన శంకర్.. బౌలింగ్ కూడా చేయలేదు. అయినా అతనికి రెండో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏం ఆడకపోయినా అవకాశాలు మాత్రం శంకర్‌కు దక్కుతాయని, అది ఐపీఎల్ అయినా.. టీమిండియాకైనా.. అదృష్టం అంటే అతనిదేనని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అసలు అతను ఏం ఆడుతాడని, ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేశారని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
త్రీడీ ఆటను చూసెదెప్పుడో..?
గత మూడేళ్లుగా అతను ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదని, అయినా అతనికి 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు శంకర్ త్రీడీ ఆట సెలెక్టర్లకు ఎలా తెలిసిందో అర్థం కావడం లేదంటున్నారు. అతని త్రీడీ ఆట కోసం గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని, జట్టు మారినా అతని రాత మాత్రం మారలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ జీవితంలోనైనా అతని త్రీడీ ఆటను చూస్తామో లేదోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
శంకర్‌పై వేటు వేయాలి...
అసలు విజయ్ శంకర్‌కు 2019 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కిందంటే నమ్మలేకపోతున్నామని సెటైర్లు పేల్చుతున్నారు. అసలు గుజరాత్ టైటాన్స్ విజయ్ శంకర్ కొనడం, నెంబర్ 3లో ఆడించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లానే గుజరాత్ టైటాన్స్ వరుస అవకాశాలు ఇస్తుందని, అతని స్థానంలో మరో యువ ఆటగాడిని ఆడించాలని సూచిస్తున్నారు. ఇలాంటి చెత్త ప్లేయర్లను పక్కనపెట్టి ఐపీఎల్ గౌరవం పెంచాలని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. శంకరే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
శుభ్‌మన్ హాఫ్ సెంచరీ..
శుభ్‌మన్ గిల్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) సూపర్ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శుభ్‌మన్ హాఫ్ సెంచరీకి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లతో 31) రాణించారు. చివర్లో రాహుల్ తేవాటియా(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14), డేవిడ్ మిల్లర్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












