Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs DC: శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్!

Shubman Gill 84 helps Gujarat Titans post 171

పుణే: శుభ్‌మన్ గిల్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) సూపర్ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శుభ్‌మన్ హాఫ్ సెంచరీకి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లతో 31) రాణించారు. చివర్లో రాహుల్ తేవాటియా(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14), డేవిడ్ మిల్లర్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే మాథ్యూ వేడ్‌ను ముస్తాఫిజుర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్(13)తో శుభ్‌మన్ ఇన్నింగ్స్ నడిపించాడు. అతని చూడ చక్కని షాట్స్‌తో గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే ముగిసిన వెంటనే పంత్.. కుల్దీప్ యాదవ్‌ను తీసుకురాగా అతను తొలి బంతికే శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా(31), శుభ్‌మన్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించారు. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ అనంతరం.. హార్దిక్‌ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయగా.. మూడో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్, రాహుల్ తెవాటియా ఔటవ్వడంతో గుజరాత్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Saturday, April 2, 2022, 21:30 [IST]
Other articles published on Apr 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+