For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs CSK: గురు-శిష్యుల అసలు సిసలు పోరు.. ఫైనల్ చేరేది ఎవరు?

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో అసలు సిసలు పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరగనున్న క్వాలిఫయర్-1లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కనుంది.

ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బలబలాల పరంగా చెన్నై‌ కంటే గుజరాత్ టైటాన్స్ మెరుగ్గా ఉంది. ముఖా ముఖి పోరులోనూ గుజారత్‌దే ఆధిక్యం. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా మూడింటికి మూడు గుజరాత్ టైటాన్సే గెలిచింది. పైగా ఆ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఆదివారం ఆర్‌సీబీని 6 వికెట్లతో చిత్తు చేసి ఇంటికి పంపించింది.

GT vs CSK:

సమష్టి ప్రదర్శనే గుజరాత్ బలం..
ఆశిష్ నెహ్రా పర్యవేక్షణ.. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్‌ అత్యంత బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్ మొదలు పెట్టిన గుజరాత్ అదే జోరును కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో తిరుగులేని స్టార్లు ఆ జట్టు సొంతం. ఎనిమిదో స్థానం వరకు హార్డ్‌ హిట్టింగ్‌ చేసే బ్యాటర్లు ఉన్నారు.

శుభ్‌మన్ గిల్ వరుస శతకాలు సాధిస్తూ మంచి ఫామ్‌లో ఉండగా.. గతంలో త్రీడీ ప్లేయర్‌ అంటూ విమర్శలపాలైన విజయ్‌ శంకర్‌ కూడా దుమ్మురేపుతుండటం గుజరాత్ టీమ్ స్పెషాలిటీ. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్‌ తెవాటియా జట్టు భారం మోసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు.

GT vs CSK:

బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రషీద్‌ఖాన్‌ ప్రత్యర్థులను హడలెత్తించాడు. షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్‌, రషీద్‌ బౌలింగ్‌ దళం రాణిస్తే మరోసారి గుజరాత్‌కు తిరుగుండదు.

చెన్నైకి అదొక్కటే సమస్య..
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం చెన్నైకి అతిపెద్ద బలం కాగా.. బ్యాటింగ్ ఆర్డర్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. ధోనీకి చివరి సీజన్‌గా భావిస్తున్న వేళ.. మిగతా సహచరులు తమ శక్తిమేర రాణించాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం కావాలంటే మాత్రం చెన్నై నాకౌట్‌ దశలో మరింత మెరుగ్గా రాణించాలి.

గత మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్లు ఈసారి కూడా దూకుడు కనబర్చాలి. అప్పుడే మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంటే బౌలర్లూ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ధోనీ 'ఫినిషింగ్‌' టచ్‌ ఇస్తే చెన్నై ఫైనల్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు. చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే చాన్స్ ఉంది.

GT vs CSK:

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, డసన్ షనక, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్: డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్, కీపర్), దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ.

Story first published: Monday, May 22, 2023, 22:17 [IST]
Other articles published on May 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+