For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs CSK: బౌలర్‌, ఫీల్డర్‌కు నొప్పి లేకుండా వికెట్ ఇచ్చేసిన సాయి సుదర్శన్!

GT vs CSK: Sai Sudarshan become first player in this IPL 2022 to out by a Hit Wicket

ముంబై: గుజరాత్ టైటాన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బౌలర్, ఫీల్డర్‌కు కష్టం లేకుండా వికెట్ ఇచ్చేసుకున్నాడు. ఫుల్ షాట్ ఆడే క్రమంలో సమన్వయం కోల్పోయి సాయి సుదర్శన్.. తన బ్యాట్‌తో వికెట్లను కొట్టేసాడు. దాంతో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సాయి సుదర్శన్ ఔటైన తీరు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కీరన్ పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన సుదర్శన్.. అదే జోరులో షార్ట్ పిచ్‌గా వేసిన ఆఖరి బంతికి పుల్ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించేకున్నాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన సుదర్శన్.. పుల్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దాంతో బంతి బ్యాట్ మిస్సవగా.. సుదర్శన్ బ్యాలెన్స్ కోల్పోయాడు. దాంతో అతని చేతిలో ఉన్న బ్యాట్ వికెట్లను గిరాటేసింది. దాంతో ఈ సీజన్‌లో హిట్ వికెట్ అయిన తొలి బ్యాటర్‌గా సాయి సుదర్శన్ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, May 6, 2022, 23:22 [IST]
Other articles published on May 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+