Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట్ మార్చిండు.. చేతికి చిక్కిండు! గిదేం దరిద్రం రుతురాజ్ భాయ్!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఘనంగా ప్రారంభించాడు. గుజరాత్ టైటాన్స్‌తో తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్.. 4 ఫోర్లు, 9 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన రుతురాజ్.. దురదృష్టవశాత్తు మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. 8 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు.

50 బంతుల్లో 92 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అప్పటి వరకు ఆడిన బ్యాట్‌ను కాదని కొత్త బ్యాట్‌ను తెప్పించుకున్న రుతురాజ్.. మూల్యం చెల్లించుకున్నాడు. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచే క్రమంలో బౌండరీ లైన్ వద్ద శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు.

ruturaj gaikwad 92 runs 21

అయితే ఈ ఓవర్‌కు ముందే రుతురాజ్ కొత్త బ్యాట్‌ను తెప్పించుకున్నాడు. ఆ బ్యాట్‌తో ఆడిన తొలి బంతికే ఔటై సెంచరీ చేజార్చుకోవడంతో.. రుతురాజ్ తప్పు చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అనవసరంగా బ్యాట్ మార్చడని, సెంచరీ అయ్యే వరకు పాత బ్యాట్‌తోనే ఆడాల్సిందని కామెంట్ చేస్తున్నారు. గిదేం దరిద్రం రుతురాజ్ భాయ్ అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్‌కు ధోనీ మెరుపులు తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. జోష్ లిటిల్ ఓ వికెట్ తీసాడు.

Story first published: Friday, March 31, 2023, 22:27 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+