Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: చెలరేగిన రుతురాజ్, ధోనీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం!

అహ్మదాబాద్: రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. 8 పరుగుల వ్యవధిలో సెంచరీ చేజార్చుకున్న రుతురాజ్.. అసాధారణ బ్యాటింగ్‌తో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. చివర్లో ధోనీ ఓ ఫోర్, సిక్సర్ బాది విలువైన పరుగులు చేశాడు.దాంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. జోష్ లిటిల్ ఓ వికెట్ తీసాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీతో డెవాన్ కాన్వే(1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ms dhoni batting csk 672

దాంతో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీతో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై బౌలర్ల‌పై ఎదురు దాడికి దిగాడు. మొయిన్ అలీ సైతం 4 బౌండరీలు, సిక్స్ బాదడంతో చెన్నై 5.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది.అయితే ఇదే స్కోర్ వద్ద రషీద్ ఖాన్‌ను రంగంలోకి దింపిన హార్దిక్ ఫలితాన్ని రాబట్టాడు. వరుస ఓవర్లలో మొయిన్ అలీ(23), బెన్ స్టోక్స్(7)‌ను రషీద్ పెవిలియన్ చేరాడు.

క్రీజులోకి అంబటి రాయుడు రాగా.. రుతురాజ్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడ్ని జోష్ లిటిల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రుతురాజ్‌ను జోసెఫ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత శివమ్ దూబే(19), రవీంద్ర జడేజా(1) వరుసగా ఔటవ్వడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న చెన్నై సాధారణ స్కోర్‌ దిశగా సాగింది. కానీ ధోనీ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Story first published: Friday, March 31, 2023, 21:48 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+