Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT VS CSK: గుజరాత్‌కు బిగ్ షాక్.. కేన్ మామకు తీవ్ర గాయం!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో కేన్ మామ కాలుకి గాయమైంది.

నొప్పితో విలవిలాడిన కేన్ మామ.. ఫిజియో సాయంతో కుంటుతూ మైదానం వీడాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు అనిపించింది. జోషువా లిటిల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్.. మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ కొట్టగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న కేన్ మామ అమాంత గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.

kane williamson gujarat titans injured 2

బౌండరీ లైన్ ధాటే క్రమంలో బంతిని లోపలికి విసిరేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక కాలిపైనే ల్యాండ్ అవ్వడం, అది స్లిప్ అవ్వడంతో అలానే కుప్పకూలిపోయాడు. ఆ బంతి కాస్త బౌండరీ లైన్‌ను ధాటింది. కేన్ మామ సూపర్ ఫీల్డింగ్‌కు సిక్సర్ కాస్త బౌండరీగా మారినా.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రతను చూస్తుంటే అతను మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాల్లేవ్.

కాళ్లు బెణికితే 4-5 మ్యాచ్‌లకు దూరం కానుండగా.. ఫ్రాక్చర్ ఉంటే మాత్రం ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే గుజరాత్ టైటాన్స్‌కు కోలుకోలేని దెబ్బ పడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

ఓవైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు రుతురాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గైక్వాడ్.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

Story first published: Friday, March 31, 2023, 21:15 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+