Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT retention list: డేవిడ్ మిల్లర్, కేన్ మామపై వేటు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్పిన్ సెన్షేషన్ రషీద్ ఖాన్‌, సిక్సర్ల వీరుడు రాహుల్ తెవాటియాను అట్టిపెట్టుకుంది. రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు గురువారంతో ముగిసింది. అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా, స్టార్ స్పోర్ట్స్ గురువారం సాయంత్రం 10 జట్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి.

గుజరాత్ టైటాన్స్ రూ. 51 కోట్లు ఖర్చు చేసి ఐదుగురి ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. ఇందులో ఇద్దరూ క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా.. మరో ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు. ప్రథమ ఆటగాడిగా రషీద్ ఖాన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. శుభ్‌మన్ గిల్‌ను రూ. 16.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. జట్టు కోసం గిల్ తన సాలరీని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. సాయి సుదర్శన్‌ను రూ. 8.5 కోట్లకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్.. రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ రూ. 4 కోట్లకు అట్టిపెట్టుకుంది.

GT retention list Gujarat Titans full list of retained and released players

గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ లిస్ట్:

శుభ్‌మన్ గిల్-రూ. 16.5 కోట్లు

రషీద్ ఖాన్-రూ. 18 కోట్లు

సాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లు

రాహుల్ తెవాటియా-రూ. 4 కోట్లు

షారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లు

రిటెన్షన్ కోసం ఖర్చు చేసిన డబ్బులు: రూ. 51 కోట్లు.

పర్స్‌లో మిగిలిన డబ్బులు: రూ. 69 కోట్లు.

గుజరాత్ రిలీజ్ లిస్ట్:
ఉమేశ్ యాదవ్, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, వృద్దిమాన్ సాహా, దర్శన్ నల్కండే, సాయి కిషోర్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, బీబీ శరత్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగీ, మానవ్ సుతార్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, జోష్ లిటిల్, నూర్ అహ్మద్, అజ్ముతుల్లా ఒమర్జాయ్, స్పెన్సర్ జాన్సన్.

Story first published: Thursday, October 31, 2024, 20:50 [IST]
Other articles published on Oct 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+