Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT Playing XI vs RR: తెలుగోడికి ఛాన్స్.. రాజస్థాన్‌తో ఆడే గుజరాత్ టైటాన్స్ జట్టు ఇదే!

జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న గుజరాత్ టైటాన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం జైపూర్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్ 12 పరుగులు చేయలేక ఓటమిపాలైన గుజరాత్.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.

8 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్.. మరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకుంటోంది.మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఆ జట్టు కూడా సొం మళ్లీ విజయాల బాటపట్టాలనుకుంటోంది.

KS Bharat

ఇక సాలిడ్ కాంబినేషన్ కలిగిన గుజరాత్ టైటాన్స్ ఎలాంటి మార్పు చేయకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా వరుసగా విఫలమవుతున్నా.. అతని చోటుకు వచ్చే డోకా లేదు. ఒకవేళ అతన్ని పక్కనపెట్టాలనుకుంటే మాత్రం తెలుగు తేజం కేఎస్ భరత్‌కు అవకాశం దక్కుతుంది. శుభ్‌మన్ గిల్ మాత్రం మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. అతని స్థానంలో మోహిత్ శర్మ బౌలింగ్ చేయనున్నాడు.

ప్రతీ మ్యాచ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ చేధించలేకపోయింది. హాఫ్ సెంచరీతో రాణించిన హార్దిక్.. విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. మరోసారి అతను మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయనున్నాడు. విజయ్ శంకర్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా.. డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా, అభినవ్ మనోహర్ ఫినిషర్ పాత్ర పోషించనున్నారు.

గత మ్యాచ్‌ల్లో మిల్లర్ విఫలమైనా.. తేవాటియా, అభినవ్ జట్టును ఆదుకున్నారు. మహమ్మద్ షమీ పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. మోహిత్ శర్మ, జోషువా లిటిల్ అతనికి అండగా నిలవనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఆడనున్నారు.

రాజస్థాన్‌తో ఆడే గుజరాత్ జట్టు ఇదే
వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్/మోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, జోషువా లిటిల్

ఇంపాక్ట్ ప్లేయర్: మోహిత్ శర్మ/శుభ్‌మన్ గిల్

Story first published: Thursday, May 4, 2023, 21:57 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+