CSK vs GT: మహమ్మద్ షమీకి రెస్ట్.. అంబటి రాయుడు డౌట్! నేటి మ్యాచ్ బరిలోకి దిగే తుది జట్లు ఇవే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. డబుల్ హెడర్‌లో భాగంగా నేటి సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నోపై అద్భుత విజయంతో గుజరాత్ అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
దాంతో చెన్నై పరువు కోసం ఆడుతుండగా.. గుజరాత్ టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టింది. 12 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి లీగ్‌ను ఘనంగా ముగించాలనుకుంటుంది. మరోవైపు గుజరాత్ మాత్రం తమ లోపాలను సరిదిద్దుకోవడానికి మిగిలిన లీగ్ మ్యాచ్‌లను వాడుకోవాలనుకుంటుంది.

అంబటి రాయుడు డౌట్..
ఇక ముంబై ఇండియన్స్‌తో గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గాయంతో జడేజా దూరం కావడంతో శివమ్ ధూబే ప్లేస్‌కు డోకా లేదు. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న అంబటి రాయుడు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నానని ట్వీట్ చేసి ఆ వెంటనే తొలిగించాడు.
ఈ క్రమంలోనే అతను ఈ మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సీఎస్‌కే సీఈవో విశ్వనాథ్ మాత్రం రాయుడు వచ్చే సీజన్ కూడా చెన్నైతోనే ఉంటాడని స్పష్టం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మరోసారి చెలరేగితే ధోనీసేనకు తిరుగుండదు. పేస్ బౌలింగ్‌లో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

మహమ్మద్ షమీకి రెస్ట్..
గత మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్‌ను తుది జట్టులో నుంచి తప్పించి అల్జారీ జోసెఫ్‌ను గుజరాత్ ఆడించింది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో టాక్టికల్ చేంజ్ చేసామని కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్‌కు ముందు మహమ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యాలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌లతో మంచి ఫినిషర్లు కూడా ఉన్నారు.

పిచ్ రిపోర్ట్:
వాంఖడే మైదానం హై స్కోరింగ్ వేదికగా మారింది. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. డే గేమ్ కావడంతో డ్యూ ప్రభావం అస్సలు ఉండదు. టాస్ గెలిచిన జట్టు ఎలాంటి ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారీ లక్ష్యాన్ని నమోదు చేసి కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు.

తుది జట్లు(అంచనా)
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, శివం దూబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), డ్వేన్ బ్రావో, సిమ్రన్‌జిత్ సింగ్, మహీశ్ తీక్షణ, ముఖేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్/లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications