For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs GT మ్యాచ్ మధ్యలో హర్షా భోగ్లే‌తో గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ గొడవ!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లక్నో వేదికగా ఆదివారం జరిగిన ఈ డే గేమ్‌లో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

హర్షా భోగ్లే అడిగిన ఓ ప్రశ్నకు విక్రమ్ సోలంకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ గురించి మాట్లాడుకుందామని చురకలంటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 9వ ఓవర్‌‌లో విక్రమ్ సోలంకిని హర్షా భోగ్లే ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విక్రమ్ సోలంకిని ఫిట్‌గా, కుర్రాడిలా కనిపిస్తున్నారని హర్షా భోగ్లే సరదాగా అన్నాడు.

ఈ వ్యాఖ్యలకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అయిన సోలంకి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 'మనం కేవలం క్రికెట్ గురించి, మైదానంలో ఉన్న ఆటగాళ్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటే బాగుంటుంది.’అని హర్షా భోగ్లే నోరు మూయించాడు. హర్షా భోగ్లే సరదాగానే అడిగినా..సోలంకి సీరియస్ అయ్యారు. ఈ సంభాషణ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

GT Official Vikram Solanki Lashes Out At Harsha Bhogle In Heated Mid-Match Interview Says Stick To The Cricket
Photo Credit: screen grab for JioHotstar

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(4/28) నాలుగు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించగా.. అశోక్ శర్మ(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబడాకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56), జోస్ బట్లర్(37 బంతుల్లో 11 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, April 12, 2026, 21:06 [IST]
Other articles published on Apr 12, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+