IPL 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్.. హాట్‌గా హాట్‌గా హార్దిక్ సతీమణి సందడి! (ఫొటోలు వైరల్)

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో నయా ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ గర్జించింది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు తమకు తిరుగులేదని నిరూపిస్తూ తొలి టైటిల్‌తో గుబాళించింది. ఫలితంగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన గుజరాత్.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక గుజరాత్ టైటాన్స్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేకున్నా.. సారథిగా జట్టుకు వరుస విజయాలందించాడు. మొత్తం లీగ్‌లో బ్యాటింగ్‌లో 131.26 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు (మొత్తం 8) పడగొట్టి ఆల్‌రౌండర్‌గా తన సత్తా ఏంటో హార్దిక్ రుజువు చేసుకున్నాడు.
నటాషా సంతోషానికి..
గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంతో అతని సతీమణి నటాషా స్టాన్‌కోవిచ్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. విజయానంతరం మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన నటాసా.. తన భర్తను వాటేసుకొని భావోద్వేగానికి గురైంది. హార్దిక్ కష్టానికి ప్రతి ఫలం దక్కిన వేళ ఆనంద భాష్పాలు కార్చింది.
ఇక నటాషా కళ్లల్లో నుంచి నీళ్లు రావడంతో హార్దిక్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు. ఇద్దరూ కొద్దిసేపు అలానే ఉన్నారు. ఆ తర్వాత ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌కు హాజరైన నటాషా..స్టాండ్స్‌లో తన అల్లరితో జట్టుకు మద్దతు తెలిపింది.
నటాషా ఫొటోలు వైరల్..
ఈ క్రమంలోనే టీమ్‌లో ఓ సభ్యురాలిగా మారిన ఆమె.. ఫైనల్ సందర్భంగా కూడా తనదైన శైలిలో జట్టుకు అండగా నిలిచింది. విజయానంతరం హార్దిక్‌తో కలిసి టైటిల్ పట్టుకొని ఫోజులిచ్చింది. ఈ మ్యాచ్‌కు కాస్త హాట్‌గా వచ్చిన నటాషా.. తన అందంతో అభిమానుల మనసులను దోచుకుంది. ప్రస్తుతం నటాసా స్టాన్‌కోవిచ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మెరిసిన హార్దిక్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, 'ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్' హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications