Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దూకుడుకు ప్రతినిధి.. విరాట్ కోహ్లీని మించినోడు లేడు: గ్రెగ్‌ ఛాపెల్‌

Greg Chappell says Virat Kohli is the most Australian and non-Australian cricketer of alla time
Virat Kohli Is The Most Australian Non-Australian Cricketer Of All Time - Greg Chappell

అడిలైడ్‌: దూకుడుగా ఆడడంలో ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాయేతర క్రికెటర్లలో అన్ని తరాలకు భారత సారథి విరాట్‌ కోహ్లీని మించిన ఆటగాడు లేడని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసించాడు. కోహ్లీలో తమ దేశ ఆటగాళ్ల లక్షణాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నాడు. తన దూకుడుతో టెస్టు ఫార్మాట్‌కు రక్షకుడిగా నిలుస్తున్న అత్యంత ముఖ్యమైన క్రికెటర్‌ కోహ్లీ అని ఛాపెల్‌ తెలిపాడు. విరాట్ 86 టెస్టుల్లో 7240 పరుగులు చేశాడు. 27 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు బాదాడు.

దూకుడుకు ప్రతినిధి:

దూకుడుకు ప్రతినిధి:

తాజాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికతో గ్రెగ్‌ చాపెల్‌ మాట్లాడుతూ... 'గతంలో భారత జట్లు గాంధేయ సూత్రాన్ని పాటించేవి. అవసరం లేకపోయినా ప్రత్యర్థి జట్లతో గౌరవపూర్వకంగా ఆడేవి. ఈ దృక్పథాన్ని మార్చిన మొట్టమొదటి కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ. అయితే ఈ సూత్రం భారత్‌లో పని చేసింది కానీ విదేశాల్లో ఫలితాల్ని ఇవ్వలేదు. విరాట్‌ కోహ్లీ పూర్తిగా భిన్నం. దూకుడుకు ప్రతినిధి. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించాలన్నది అతడి ఆలోచన' అని అన్నాడు.

ఆస్ట్రేలియన్‌ కాని ఆస్ట్రేలియన్‌:

ఆస్ట్రేలియన్‌ కాని ఆస్ట్రేలియన్‌:

'క్రికెట్‌ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆస్ట్రేలియన్‌ కాని ఆస్ట్రేలియన్‌ ఆటగాడు. సరికొత్త టీమిండియాకు ఉదాహరణ. అత్యంత విలువైన ఆటగాడిగా.. క్రికెట్లో శక్తిమంతమైన జట్టుకు సారథిగా ఆట ఆదరణ కోసం బాధ్యతగా కృషి చేస్తున్నాడు. కోహ్లీకి ఎల్లప్పుడూ టెస్టు క్రికెటే అత్యున్నతమైనది. విరాట్ మరింత ఫిట్‌గా.. బలంగా ఉండటానికి టెస్టు క్రికెట్‌ దోహదపడుతుంది' అని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్ ఛాపెల్‌ వివరించాడు.

చివరి మూడు టెస్టులకు దూరం:

చివరి మూడు టెస్టులకు దూరం:

ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ ముగిసింది. ఇక అందరి దృష్టి నాలుగు టెస్టుల సిరీస్‌పైనే పడింది. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. అయితే పితృత్వ సెలవులపై కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. 2018-19 పర్యటనలో మాదిరిగా భారత్ టెస్టు సిరీస్‌ విజయాన్ని పునరావృతం చేయాలంటే గతంలో ఛతేశ్వర పుజారా, జస్ప్రీత్ బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.

జనవరిలో తల్లి కాబోతున్న అనుష్క:

జనవరిలో తల్లి కాబోతున్న అనుష్క:

టీమిండియా కెప్టెన్‌ విరాట్ ‌కోహ్లీ బాటలో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియ్సమన్‌ నడిచాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో తల్లి కాబోతున్న సందర్భంగా అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలి టెస్టు తర్వాత వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. అదే కారణంతో విలియమ్సన్‌ వెస్టిండీస్‌తో ఆడాల్సిన రెండో టెస్టుకు దూరం అయ్యాడు. విలియమ్సన్‌ సతీమణి సారా రహీమ్‌ కొద్దిరోజుల్లో తొలిసారి మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుంది.

విక్టర్‌ గోల్‌.. హైదరాబాద్‌కు మూడో డ్రా!!

Story first published: Saturday, December 12, 2020, 11:47 [IST]
Other articles published on Dec 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+