'గంగూలీది కష్టపడే తత్వం కాదు.. తన క్రికెట్ను మెరుగుపర్చుకొవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు'

సిడ్నీ: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మరోసారి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గంగూలీది కష్టపడే తత్వం కాదని, తన క్రికెట్ను మెరుగుపర్చుకొవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదన్నాడు. దాదా కెప్టెన్గా జట్టులో ఉండాలనుకునేవాడని, ఎప్పుడూ పెత్తనం చెలాయించడమే తనకు ఇష్టమని చాపెల్ చెప్పుకొచ్చాడు. అయితే దాదా వల్లనే తాను కోచ్ అయ్యానన్నాడు. 2005-2007 మధ్య కాలంలో చాపెల్ టీమిండియా కోచ్గా ఉన్నాడు. ఈ రెండేళ్లలో అప్పటి సారథి గంగూలీ, చాపెల్ మధ్య ఎన్నో విభేదాలు తలెత్తాయి.

పరస్పరం ఆరోపణలు
గ్రెగ్ చాపెల్ టీమిండియాలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. అప్పటికే బౌలింగ్లో మెరుగ్గా రాణిస్తున్న ఇర్ఫాన్ పఠాన్ను ఓపెనర్గా పంపించి.. అతడి కెరీర్ నాశనానికి కారకుడయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎన్నో మార్పులు చేశాడు. ఇక సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేజారడం, ఆటగాడిగా తుది జట్టులో కూడా చోటు దక్కకపోవడం లాంటివి కూడా జరిగాయి.
దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో వీరిద్దరూ ఇప్పటికే ఎన్నోసార్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తన ఆత్మకథ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్లో తన క్రికెట్ కెరీర్లో చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే.. అది గ్రెగ్ చాపెల్ను కావాలని కోచ్గా నియమించుకోవడమేనని దాదా పేర్కొన్నాడు.

గంగూలీ వల్లే కోచ్ అయ్యా:
ఇక గ్రెగ్ చాపెల్ సైతం వీలు చిక్కినప్పుడల్లా సౌరవ్ గంగూలీని విమర్శిస్తూనే ఉన్నాడు. తాజాగా చాపెల్ మాట్లాడుతూ... 'టీమిండియా కోచ్గా రమ్మని ముందుగా గంగూలీయే నన్ను సంప్రదించాడు. జాన్ బుకానన్ ఆస్ట్రేలియాకు కోచింగ్ ఇస్తున్నపుడే ఒకటి ఫిక్స్ అయ్యా. నేను కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని పటిష్టమైన దేశపు జట్టుతో పనిచేయాలని ఉండేది. ఆ అవకాశం నాకు త్వరగానే వచ్చింది. గంగూలీ వల్లే నాకు కోచ్ అవకాశం దక్కిందని కచ్చితంగా చెప్పగలను' అని అన్నాడు.
India vs England: ఎంఎస్ ధోనీ సలహాలు.. నన్ను మెరుగైన వికెట్కీపర్గా మార్చాయి: ఇంద్రాణి రాయ్

గంగూలీది శ్రమించే తత్వం కాదు
'టేందినియాకు కోచింగ్ ఇచ్చిన ఆ రెండేళ్ల పాటు ఎటువైపు చూసినా కఠిన సవాళ్లే. అంచనాలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ గురించి చర్చ. దాదా చుట్టూ కొన్ని సమస్యలు ఉన్నాయి. నిజానికి గంగూలీది కఠినంగా శ్రమించే తత్వం కాదు. తన క్రికెట్ను మెరుగుపర్చుకొవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. అయితే కెప్టెన్గా మాత్రం తానే జట్టులో ఉండాలనుకునేవాడు. అలా అయితే పరిస్థితులన్నీ తన అదుపులోనే ఉంటాయన్న భావన తనది' అని 72 ఏళ్ల ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.

ద్రవిడ్కు పగ్గాలు
కోచ్గా చాపెల్ వివాదాస్పదంగా వ్యవహరించాడు. దాదా కెప్టెన్సీ కోల్పోయాడు. 2007 ప్రపంచకప్ జట్టులో గంగూలీ ఒక భాగమే కానీ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో ఆడాడు. అప్పుడు భారత్ కనీస ప్రదర్శన కూడా చేయలేదు. లీగ్ దశలో చిన్న జట్టు అయిన బంగ్లాపై ఓడి టోర్నీ నంచి నిష్క్రమించింది. ఆ తర్వాత చాపెల్ ఒప్పందం ముగిసింది. అతడు తిరిగి దరఖాస్తు చేసుకోలేదు. గంగూలీ మరో సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. దాదా తన చివరి వన్డేను నవంబర్ 2007లో, 2008లో టెస్ట్ మ్యాచ్ ఆఖరిగా ఆడాడు. ఆపై ఎంఎస్ ధోనీ జట్టు పగ్గాలు అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications