
ద్రవిడ్‌కు సహకారం అందలేదు..
'ద్రవిడ్ భారత్ జట్టును వరల్డ్ బెస్ట్ టీమ్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అతని సహచర ఆటగాళ్లకు అలాంటి ఫీలింగ్ లేదు. ముఖ్యంగా కెరీర్ చివరి దశకు చేరిన సీనియర్ ఆటగాళ్లు ఎంత సేపు జట్టులో చోటు కాపాడుకోవడంపైనే దృష్టిసారించారు. ద్రవిడ్‌కు కావాల్సిన మద్దతు అందించలేకపోయారు.'అని చాపెల్ తెలిపాడు. అయితే సౌరవ్ గంగూలీపై వేటు వేయడంతో ఆటగాళ్లంతా దారిలోకి వచ్చారని, తమకు 12 నెలలు అద్భుతంగా సాగిందన్నాడు.

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించా..
'సౌరవ్ గంగూలీని జట్టు నుంచి తప్పించడంతో మిగతా ఆటగాళ్లంతా మా దారిలోకి వచ్చారు. ఎందుకంటే సౌరవ్ గంగూలీపై వేటు వేసినప్పుడు తమపైనా కూడా వేయవచ్చనే భావనతో ఆటపై దృష్టి సారించారు. ఓ 12 నెలలు అద్భుతంగా సాగింది. కానీ ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో గంగూలీ జట్టులోకి వచ్చాడు. ఆటగాళ్లు కూడా ఎలాంటి మార్పు అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. రెండేళ్ల పదవీ కాలం ముగిశాక బీసీసీఐ నా కాంట్రాక్టు పొడిగిస్తామని చెప్పినప్పటికీ.. ఈ ఒత్తిడి అవసరం లేదని తప్పుకున్నాను'అని చాపెల్ చెప్పుకొచ్చాడు.

గంగూలీది కష్టపడేతత్వం కాదు..
సౌరవ్ గంగూలీ తన ఆట మెరుగుపర్చుకోవడానికి కష్టపడేవాడు కాదని, కేవలం కెప్టెన్‌గా మాత్రమే జట్టులో ఉండేందుకు ఇష్టపడేవాడని చాఫెల్ తెలిపాడు.'భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని నన్ను గంగూలీ సంప్రదించాడు. అతని వల్లే టీమిండియాకు కోచ్‌గా పనిచేసే అవకాశం దక్కింది. అయితే కోచ్‌గా నా రెండేళ్ల కాలంలో ప్రతి క్షణం సవాలుగా గడిచింది. జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉండేవి. గంగూలీ కెప్టెన్‌గా ఉండడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. అతను కష్టపడాలనుకోలేదు. తన ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించలేదు. కేవలం కెప్టెన్‌గా మాత్రమే జట్టులో ఉండాలనుకున్నాడు. అలా అయితే పరిస్థితులన్నీ తన చేతిలోనే ఉంటాయని అతని భావన'అని చాపెల్ చెప్పుకొచ్చాడు.

అతిపెద్ద తప్పిదం..
గ్రెగ్ చాపెల్ పర్యవేక్షణలోని టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అతను చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి. అప్పటికే బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్న ఇర్ఫాన్ పఠాన్‌ను ఓపెనర్‌గా పంపించి.. అతడి కెరీర్ నాశనానికి కారకుడయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎన్నో మార్పులు చేశాడు. ఇక సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేజారడం, ఆటగాడిగా తుది జట్టులో కూడా చోటు దక్కకపోవడం లాంటివి కూడా జరిగాయి.
దాంతో 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్.. పసికూన బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక చేతిలో ఓడి అత్యంత అవమానకరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక చాపెల్‌ను టీమిండియా కోచ్‌గా తీసుకురావడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదమని గంగూలీ తన ఆత్మ కథ 'ఏ సెంచరీ నాట్ ఏ ఎనఫ్'లో రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












