Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: కంగ్రాట్స్.. ద్రవిడ్! మొత్తానికి సాధించావ్: గ్రేగ్ ఛాపెల్

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవడంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్రేగ్ ఛాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్‌‌గా రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్ అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. 17 ఏళ్ల క్రితం ఇదే వెస్టిండీస్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2007లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.

పసికూన బంగ్లాదేశ్ చేతిలో ద్రవిడ్ సేన ఓటమిపాలైంది. ఆ జట్టుకు గ్రేగ్ ఛాపెల్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ ఓటమితోనే అతని వివాదాస్పద కోచింగ్ కెరీర్ ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలోనే గ్రేగ్ ఛాపెల్ అత్యంత వివాదాస్పదమైన కోచ్‌గా నిలిచిపోయాడు.

Greg Chappell Reacts With Special Message To Rahul Dravid After India s T20 World Cup title glory

భారత జట్టును నాశనం చేయడానికే గ్రేగ్ ఛాపెల్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడని అప్పట్లో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే జట్టులోని రాజకీయాలను ప్రశ్నించడంతో పాటు సీనియర్ ఆటగాళ్లను తప్పించి అపార నైపుణ్యం కలిగిన రాహుల్ ద్రవిడ్‌ను కెప్టెన్ చేయడాన్ని సహించలేకపోయారని కొందరు క్రికెట్ అభిమానులు ఇప్పటికీ చెప్పే మాట.

రాహుల్ ద్రవిడ్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం నచ్చక కొందరు సీనియర్ ఆటగాళ్లు అతనికి సహకరించలేదని, దాంతో టీమిండియాకు ఘోర పరాజయాలు ఎదురయ్యాయని ఛాపెల్‌ను వెనకేసుకొచ్చేవారున్నారు.

2007 వన్డే ప్రపంచకప్‌తో పాటు అంతకుముందు భారత్ వేదికగా జరిగిన 2006 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనే టీమిండియా గ్రూప్‌ దశలోనే వెనుదిరిగింది. ఈ పరాజయాలతో గ్రేగ్ ఛాపెల్‌పై బీసీసీఐ వేటు వేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకే రాహుల్ ద్రవిడ్ జట్టుకు దూరమయ్యాడు.

2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ రాహుల్ ద్రవిడ్ లేడు.దాంతో ఐసీసీ టైటిల్ లేకుండానే రాహుల్ ద్రవిడ్ కెరీర్ ముగిసింది. అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా కెరీర్ ప్రారంభించిన రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు ప్రపంచకప్‌ను ముద్దాడాడు. 2023 ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్ 2023 టైటిళ్లు తృటిలో చేజారినా.. ప్రపంచకప్ గెలిచి తన ముచ్చట తీర్చుకున్నాడు.

ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్‌కు గ్రేగ్ ఛాపెల్ అభినందనలు తెలిపాడు. 'టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా అభినందనలు. మరీ ముఖ్యంగా ఈ విజయంలో రాహుల్ ద్రవిడ్ భాగమవ్వడం నాకు సంతోషాన్నిచ్చింది. జట్టుతో తన ప్రయాణాన్ని రాహుల్ ద్రవిడ్ అద్భుతంగా ముగించాడు. కొన్నేళ్ల క్రితం మేం ఇద్దరం కలిసి ఈ విజయాన్ని అందుకోవాలని భావించాం. కానీ కుదరలేదు. మొత్తానికి రాహుల్ ద్రవిడ్ తన ముచ్చట తీర్చుకున్నాడు.'అని గ్రేగ్ ఛాపెల్ ఆసీస్ మీడియాతో అన్నాడు. గ్రేగ్ ఛాపెల్ సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం అత్యంత వివాదాస్పదమైంది.

Story first published: Monday, July 1, 2024, 21:07 [IST]
Other articles published on Jul 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+