Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

The Hundred 2025: ఉత్కంఠ పోరులో కావ్య మారన్ టీమ్ విజయం!

ద హండ్రెడ్ లీగ్ 2025‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు చెందిన నార్తర్న్ సూపర్‌ చార్జర్స్ సంచలన విజయాన్నందుకుంది. బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నార్తర్న్ సూపర్‌ చార్జర్స్ 3 వికెట్ల తేడాతో సదరన్ బ్రేవ్ జట్టును ఓడించింది. ఆఖరి బంతికి నార్తర్న్ సూపర్ చార్జర్స్ గెలుపునకు 5 పరుగులు అవసరమయ్యాయి. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

తైమాల్ మిల్స్ వేసిన చివరి బంతిని గ్రహం క్లార్క్ అనూహ్యంగా సిక్స్ బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో నార్తర్న్ సూపర్ చార్జర్స్ ఆటగాళ్లు ఎగిరి గంతేసారు. ఈ విన్నింగ్ షాట్‌తో సదరన్ బ్రేవ్ హోమ్ గ్రౌండ్ మూగబోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఓటమితో బ్రేవ్ వరుస విజయాల పరంపరకు బ్రేక్ పడింది.

Graham Clark s Last-Ball Six Seals Thrilling Win for Kavya Maran s Northern Superchargers

గెలిపించిన గ్రహం క్లార్క్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. లౌరీ ఈవాన్స్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. జేమ్స్ కోల్స్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) అజేయంగా నిలిచాడు. నార్తర్న్ సూపర్ చార్జర్స్ బౌలర్లలో జాకోబ్ డఫ్ఫీ(3/26) మూడు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం నార్తర్న్ సూపర్ చార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్లకు 141 పరుగులు చేసి గెలుపొందింది. గ్రహం క్లార్క్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్), జాక్ క్రాలీ(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో క్రైగ్ ఓవర్టన్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(2/15), టైమల్ మిల్స్(2/38) రెండేసి వికెట్లు తీసారు.

ఆఖరి బంతికి సిక్స్ కొట్టి..

నార్తర్న్ సూపర్ చార్జర్స్ విజయానికి చివరి 5 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన రషీద్ తొలి బంతికి సింగిల్ తీసి క్లార్క్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. రెండో బంతికి అతను బౌండరీ బాదాడు. తర్వాతి రెండు బంతులను డాట్ చేయడంతో ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. దాంతో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ క్లార్క్ అనూహ్యంగా లెగ్ సైడ్ సిక్స్ బాది సంచలన విజయాన్నందించాడు.

రూ. 1,161 కోట్లతో కొనుగోలు..

ఇండియా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా ఉన్న కావ్య మారన్.. తన ఫ్రాంచైజీ సామ్రాజ్యాన్ని ఇంగ్లండ్ వరకు విస్తరించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న "ది హండ్రెడ్" క్రికెట్ టోర్నీలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును సన్ టీవీ నెట్‌వర్క్ రూ.1,161(100.5 మిలియన్ పౌండ్లు) కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌ నెట్‌వర్క్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఉంది.

తాజాగా ఈ జాబితాలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ చేరింది. ఈ మూడు జట్లను కావ్య పాపనే చూసుకుంటుంది. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ కెప్టెన్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యవహరిస్తుండగా.. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Thursday, August 14, 2025, 12:08 [IST]
Other articles published on Aug 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+