వైభవ్ సూర్యవంశీతో రోహిత్ స్థానానికి ముప్పు: మాజీ క్రికెటర్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై అనవసర ఒత్తిడి నెలకొంటుందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు.
వైభవ్ తన దూకుడుతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడని, కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మకు ఇది సవాల్‌గా మారిందని చెప్పాడు. వరుసగా మ్యాచ్‌ల్లో విఫలమైతే తన స్థానాన్ని కూడా వైభవ్ భర్తీ చేయగలడనే ఆందోళన రోహిత్ శర్మను వెంటాడుతుందని చెప్పాడు.
టెస్ట్, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వారి వయసు, ఫామ్ కారణంగా ప్రపంచకప్ ఆడే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రతీ మ్యాచ్‌లో వారు తమ సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులు సాధించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో చోటు దక్కింది. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో చెలరేగితే మూడు ఫార్మాట్లలో అవకాశాలు అందుకోనున్నాడు. దాంతోనే సీనియర్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మపై అదనపు ఒత్తిడి పెరిగిందని గ్రేమ్ స్వాన్ అన్నాడు.
'తమ క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్న ఏ ఆటగాడికైనా ప్రత్యామ్నాయం చూడటం సహజం. ప్రజలు ఎప్పుడూ తదుపరి కోహ్లీ ఎవరు, తుదపరి రోహిత్ శర్మ ఎవరు..?అని వెతుకుతుంటారు. ఒకవేళ రోహిత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే.. అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్ల వైపు జనాలు చూడటం ప్రారంభిస్తారు. కాబట్టి అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ రాణించడం కీలకం. ముఖ్యంగా వచ్చే 6 వారాలు అతని సత్తాకు పరీక్షగా నిలవనున్నాయి.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. జులైలో ఇంగ్లండ్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. జూలై వాతావరణం వైట్ బాల్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రోహిత్ శర్మకు ఈ సిరీస్ మంచి అవకాశంగా మారుతుంది. ఈ సవాల్ రోహిత్ శర్మను మరింత ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారుస్తుంది.'అని గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

