Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిడిలార్డర్‌లో కోహ్లీ నుంచి అయితలేదు.. ఓపెనర్‌గా ఆడించాలి: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్

Graeme Swann says India to open with Virat Kohli, leave out Ishan Kishan for 2nd T20 vs ENG

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ పంపించాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సూచించాడు. మిడిలార్డర్‌లో కోహ్లీ ప్రభావం చూపలేకపోతున్నాడని, సూర్యకుమార్, దీపక్ హుడాలా ధాటిగా ఆడలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్ పంపిస్తే రోహిత్‌కు సరైనా జోడీగా రాణిస్తాడని చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఫస్ట్ టీ20కి దూరమైన సీనియర్ ఆటగాళ్లు శనివారం జరిగే రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్‌గా కోహ్లీ..

ఓపెనర్‌గా కోహ్లీ..

ఈ క్రమంలోనే ఓ చానెల్‌తో మాట్లాడిన గ్రేమ్ స్వాన్.. కోహ్లీ తుది జట్టులోకి వస్తే ఇషాన్‌కు బదులు ఓపెనింగ్‌ చేయించాలని సూచించాడు. 'కోహ్లీ లాంటి మేటి ఆటగాడిని మూడో స్థానంలో ఆడించొద్దు. ఎందుకంటే అతడు మధ్య ఓవర్లలో సూర్యకుమార్‌, దీపక్‌ హుడాలా అంత ప్రభావవంతంగా ఆడలేకపోతున్నాడు. ఒకవైపు రోహిత్‌ అద్భుతంగా ఆడుతుంటే.. మరోవైపు కోహ్లీ అతడిని అనుసరిస్తాడు. వాళ్లిద్దరూ ఓపెనింగ్‌ చేస్తే మంచి పరుగులు సాధిస్తారు. తర్వాత ఎలాగూ సూర్య, దీపక్‌ అద్భుతంగా ఆడతారు' అని స్వాన్‌ పేర్కొన్నాడు.

 బీ టీమ్ పంపించాలి..

బీ టీమ్ పంపించాలి..

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలవాలంటే ఆస్ట్రేలియాకు 'బీ' టీమ్‌ను పంపించాలని సెటైర్లు పేల్చాడు. గురువారం ఇంగ్లాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో టీమిండియా రోహిత్‌ శర్మ సారథ్యంలో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే తొలి మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చిన విరాట్‌ కోహ్లీ, పంత్‌, బుమ్రా వంటి ఆటగాళ్లను రెండో మ్యాచ్‌లో తుది జట్టులోకి తీసుకుంటే అది ఇంగ్లాండ్‌కు కలిసివస్తుందని చెప్పాడు.

సీనియర్లు వస్తే ఓటమి..

సీనియర్లు వస్తే ఓటమి..

'రెండో మ్యాచ్‌లో ఈ కీలక ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకుంటే అది ఇంగ్లండ్‌కే ప్రయోజనం. టీమిండియా అదే పనిచేయాలని నేను ఆశిస్తున్నా. అలా చేస్తే ఇంగ్లండ్‌ గెలవొచ్చు. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో ఆడించిన ఆటగాళ్లనే రెండో మ్యాచ్‌లోనూ ఆడిస్తే అప్పుడు ఇంగ్లండ్ మళ్లీ ఓడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ పంత్‌, కోహ్లీ, బుమ్రా వంటి వారిని తుది జట్టులోకి తీసుకొంటే అది ప్రస్తుత జట్టు లయను దెబ్బతీస్తుంది' అని పేర్కొన్నాడు.

Story first published: Friday, July 8, 2022, 20:48 [IST]
Other articles published on Jul 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+