Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గదిలో జరగాల్సింది.. కెమెరాల ముందు చేయడం ఏంటి?: గ్రేమ్ స్మిత్

లక్నో సూపర్ జెయింట్స్‌ ఓనర్ సంజీవ్ గోయెంకా తీరుపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ గ్రేమ్ స్మిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ పట్ల గోయెంకా వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లొ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తయ్యింది.

ముందుగా బ్యాటింగ్‌లో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్.. అనంతరం బౌలింగ్‌లో తేలిపోయింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంకర బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఈ ఘోర పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

Graeme Smith says Should happen behind closed door after LSG owner Sanjiv Goenka s shocking behavior with KL Rahul

ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు హాజరైన అతను.. ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్‌తో సంజీవ్ గోయెంకా సీరియస్‌గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బాధ్యుడిని చేస్తూ గోయెంకా క్లాస్ పీకినట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది.

మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ వివరించే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయారు. వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న గ్రేమ్ స్మిత్.. సంజీవ్ గోయెంకా తీరును తప్పుబట్టాడు. గదిలో చేయాల్సిన పనిని, కెమెరాల ముందు చేయడం ఏంటని ప్రశ్నించారు.

'తమ జట్టు విజయం కోసం పరితపించిన ఓనర్ ఆవేదన ఇది. తమ జట్టు పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయంపాలైంది. దాంతో అతనిలో భావోద్వేగాలు రేగాయి. అయితే ఇలాంటి సంభాషణలు గదిలో చేయాల్సింది. అక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. వారు ఏది కూడా మిస్ చేశారు. కేఎల్ రాహుల్ మీడియా సమావేశం నిర్వహించి తమ ఓనర్‌తో ఏం మాట్లాడారో చెప్పాలి.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఇక సంజీవ్ గోయెంకా తీరుపై ఆర్‌సీబీ మాజీ కోచ్ మైక్ హెస్సేన్ అసహనం వ్యక్తం చేశాడు. ఏం సంభాషణ జరిగిందో అనేదానిపై క్లారిటీ లేకున్నా.. రాహుల్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడనే విషయం అర్థమవుతుందని తెలిపాడు.

Story first published: Thursday, May 9, 2024, 15:58 [IST]
Other articles published on May 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+