గంగూలీ, ధోనీ కెప్టెన్సీలో ఉన్న తేడా అదే: గ్రేమ్ స్మిత్

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల సారథ్యంపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దాదా కష్టపడితే.. ధోనీకి ప్రతిఫలాలు అందాయని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలందుకున్న గంగూలీ.. మేటీ ఆటగాళ్లతో జట్టు తయారు చేసి ధోనీ చేతిలో పెట్టాడని తెలిపాడు. అయితే ధోనీ, దాదా సారథ్యంపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరి కెప్టెన్సీలో ఉన్న తేడా మహేంద్ర సింగ్ ధోనీనే అని తెలిపాడు. మహీలాంటి ఫినిషర్ గంగూలీ జట్టులో ఉంటే మరింత సక్సెస్ సాధించేవాడని తెలిపాడు.

ధోనీ ఉంటే చాలు..
‘దాదా, మహీ కెప్టెన్సీలో ఉన్న అతిపెద్ద తేడా ధోనీనే. అతనిలాంటి మిడిలార్డ్ బ్యాట్స్‌మన్, ప్రశాంతంగా మ్యాచ్‌ను ముగించే ఫినిషర్, ఎలాంటి పరిస్థితులోనైనా జట్టును గెలిపించే ఆటగాడు ఉంటే విజయాలు వాటంతటే అవే వచ్చి చేరుతాయి. నా వరకు వాళ్ల కెప్టెన్సీలో ఉన్న తేడా అదే'అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ ఆధిపత్యం..
‘ఒక వేళ ధోనీ వంటి ఆటగాడు దాదా జట్టులో ఉండి ఉంటే అతను మరింత సక్సెస్ సాధించేవాడు. మరిన్నీ ట్రోఫీలు అందుకునేవాడు. ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో దాదా జట్టును నడిపించాడు. ఆ సమయంలో ఆసీస్ ప్రపంచ క్రికెట్‌ను శాసించిందనే చెప్పాలి. ధోనీలాంటి ఫినిషర్ ఉంటే దాదా ఆసీస్‌ను అడ్డుకునేవాడు.'అని ఈ సౌతాఫ్రికా లెజెండ్ తెలిపాడు.

టెస్ట్‌ల్లో దాదానే..
‘నా దృష్టిలో ఓపెనింగ్ వదులుకోవడం, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం సవాల్‌తో కూడుకున్నదే. టెస్ట్ క్రికెట్ విషయానికి కొస్తే ధోనీ కన్నా దాదానే గ్రేట్. నేను అతన్నే ఎంచుకుంటా. ఇక వన్డేల్లో మాత్రం నా చాయిస్ ధోనీనే'అని స్మిత్ స్పష్టం చేశాడు. ఇక 311 వన్డేలు ఆడిన గంగూలీ 10773 రన్స్ చేయగా.. ధోనీ 350 మ్యాచ్‌ల్లో 10773 పరుగులు చేశాడు. దాదా కన్నా 590 పరుగులు తక్కువున్నా వన్డేల్లో తాను ధోనీనే ఎంచుకుంటానని స్మిత్ స్పష్టం చేశాడు. ఇక టెస్ట్‌ల్లో దాదా 7212 రన్స్ చేయగా.. ధోనీ 4876 పరుగులు చేశాడు.

క్లిష్ట స్థితిలో..
భారత్ జట్టు ఫిక్సింగ్‌లో కూరుకుపోయిన క్లిష్ట స్థితిలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. సీనియర్లకు అండగా నిలుస్తూ.. జూనియర్లను ఎంకరేజ్ చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ.. 2005లో అనూహ్యంగా అతని నుంచి కెప్టెన్సీ చేజారగా.. 2007లో ధోనీ చేతికి జట్టు పగ్గాలు అందాయి. అప్పటికే బాగా సెటిలైన టీమ్.. 2011 నాటికి తిరుగులేని స్థితికి చేరుకుంది. ఇక 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్(97) అద్భుత ప్రదర్శనకు ధోనీ ధనాధాన్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ 28 ఏళ్ల కలను సాకారం చేసుకున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications