Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రేమ్ స్మిత్ పదవి కాలం మరో రెండేళ్లు పొడిగింపు!

Graeme Smith named South Africa’s director of cricket until the end of April 2022

కేప్‌టౌన్‌: క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆ దేశ మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. గతేడాది డిసెంబర్‌లో తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితుడైన స్మిత్‌ను రెండేళ్ల పాటు పూర్తిస్థాయిలో కొనసాగించేందుకు క్రికెట్‌ సౌతాఫ్రికా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి స్మిత్‌ను తాత్కాలిక డైరక్టర్‌గా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ వరకే నియమించారు. ఇక సీఎస్‌ఏ డైరక్టర్‌గా 2022, మార్చి నెల వరకూ స్మిత్‌ కొనసాగనున్నట్లు తాజా ప్రకటనలో తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ జాక్వస్‌ ఫాల్‌ తెలిపారు.

'స్మిత్‌ మా క్రికెట్‌కు మూలస్తంభం. దక్షిణాఫ్రికా క్రికెట్‌ మనుగడకు స్మిత్‌ గేమ్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. తాత్కాలిక పదవీ బాధ్యతల్లోనే స్మిత్ అద్భుతంగా పనిచేశాడు. అద్భుతమైన ప్రణాళికలతో ముందుండి నడిపించాడు. అలాగే తాత్కాలిక జాతీయ సెలెక్టర్​గా లిండా జోండితో కలిసి అనేక వ్యూహాత్మక నియామకాలు చేపట్టాడు. అందుకే స్మిత్​కు పూర్తిస్థాయి క్రికెట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగిస్తున్నాం'అని జాక్వస్‌ ఫాల్‌ తెలిపాడు.

ఇక తన పదవీ కాలం పొడిగించడంపై స్మిత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 'తనకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు మరో రెండేళ్లు పొడిగించడంతో రోడ్‌ మ్యాప్‌ ప్లానింగ్‌ సులభం అవుతుంది. జాక్వస్‌ ఫాల్‌ చెప్పినట్లు నా ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ను మెరుగుపరచడమే కాకుండా కిందిస్థాయి(దేశవాళీ) క్రికెట్‌ను పటిష్టం చేసుకుంటూ రావాలి.' అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా తరఫున 117 టెస్టులు, 197 వన్డేలు, 33 అంతర్జాతీయ టీ20లు ఆడిన గ్రేమ్ స్మిత్.. మూడు ఫార్మాట్లలో కలిపి 17,236 పరుగులు చేశాడు.

Story first published: Friday, April 17, 2020, 20:51 [IST]
Other articles published on Apr 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+