For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2026: గ్రేస్ హ్యారీస్, మంధాన విధ్వంసం.. ఆర్‌‌సీబీ ఘన విజయం!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) దుమ్మురేపుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత ఓపెనర్లు గ్రేస్ హ్యారీస్, స్మృతి మంధాన విధ్వంసంతో 47 బంతులు మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డియా డాటిన్(37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్(2/50), నదైన్ డి క్లెర్క్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. లారెన్ బెల్ ఒక వికెట్ పడగొట్టింది.

Grace Harris and Smriti Mandhana Power RCB to 9-Wicket Win Over UP Warriorz in WPL 2026

అనంతరం ఆర్‌సీబీ 12.1 ఓవర్లలో 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు గ్రేస్ హ్యారీస్(40 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85), స్మృతి మంధాన(32 బంతుల్లో 9 ఫోర్లతో 47 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. యూపీ వారియర్స్ బౌలర్లలో శిఖా పాండే ఒక్కతే వికెట్ తీసింది.

లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన ఆర్‌సీబీ.. పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. గ్రేస్ హ్యారీస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. విజయం ముంగిట గ్రేస్ హ్యారీస్‌ను శిఖా పాండే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. తొలి వికెట్‌‌కు నమోదైన 137 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ బౌండరీ బాదగా.. బై రూపంలో వచ్చిన బౌండరీతో స్మృతి మంధాన విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్‌సీబీ.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Monday, January 12, 2026, 22:36 [IST]
Other articles published on Jan 12, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+