For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ కింగ్ మహేంద్ర సింగ్ ధోనీ.. తేల్చేసిన గూగులమ్మ!

Google says: King of cricket is Virat Kohli and King of IPL is MS Dhoni

హైదరాబాద్: ఈ తరం ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మైదానంలో అతను చేసిన పరుగులు, ఘనతలే అతని ఎంతటి విలువైన ఆటగాడో తెలియజేస్తాయి. అతని ఆటకు ముగ్దులైన అభిమానులు విరాట్‌ను ముద్దుగా క్రికెట్ రారాజు అని పిలుచుకుంటారు. అయితే గూగుల్ ఏకంగా విరాట్ కోహ్లీకి 'క్రికెట్‌ కింగ్‌'అనే బిరుదే ఇచ్చింది. గూగుల్‌లో 'king of cricket'అని సెర్చ్ చేస్తే విరాట్ కోహ్లీ, అతని బయో వస్తుంది. అతని వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, ముద్దు పేరుతో సహా ఎత్తును కూడా తెలియజేస్తుంది.

విరాట్‌కు గూగులమ్మ బిరుదు..

విరాట్‌కు గూగులమ్మ బిరుదు..

ప్రస్తుతం ఈ గూగులమ్మ సమాచారంతో విరాట్ అభిమానులు, ముఖ్యంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. విరాట్ కోహ్లీ ఎప్పటికీ కింగేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గూగుల్ సెర్చ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని గూగుల్ వెల్లడించింది. ధోనీ కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టైటిళ్లన్నిటినీ అందించిన ఏకైక కెప్టెన్‌‌గా నిలిచాడు.

వరల్డ్ బెస్ట్ కెప్టెన్..

వరల్డ్ బెస్ట్ కెప్టెన్..

ఇప్పటికీ వరల్డ్ బెస్ట్ కెప్టెన్ ఎవరంటే.. చాలా మంది మహీ పేరునే సూచిస్తారు. మాజీ క్రికెటర్లు సైతం మైదానంలో మహీ రచించే వ్యూహాలకు ఫిదా అవుతారు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్ దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఇప్పటికే మూడు టైటిళ్లు అందించిన మహీ.. ఈసారి కూడా చాంపియన్ నిలిపి గౌరవంగా ఆటకు అల్విదా ప్రకటించాలనుకుంటున్నారు. ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే గత సీజన్ మినహా.. ప్రతీ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరింది. వ్యక్తిగతంగాను ధోనీకి మంచి రికార్డు ఉంది.

ఐపీఎల్ కింగ్ మహీ..

ఐపీఎల్ కింగ్ మహీ..

అయితే గూగులమ్మ ధోనీకి ఐపీఎల్ కింగ్ అనే బిరుదిచ్చింది. గూగుల్‌లో 'king of ipl'అని సెర్చ్ చేస్తే మహేంద్ర సింగ్ ధోనీ పేరు సూచిస్తుంది. అతని వ్యక్తిగత వివరాలను కూడా సూచిస్తుంది. ఇక గూగులమ్మ ఇచ్చిన బిరుదుకు ధోనీ ఫ్యాన్స్‌తో పాటు సీఎస్‌కే తెగ ఆనందపడుతున్నారు. నిజంగానే మహీ.. ఐపీఎల్ కింగ్ అని పేర్కొంటున్నారు.

ఐపీఎల్ 204 మ్యాచ్‌లు ఆడిన మహీ..41 సగటుతో 4632 రన్స్ చేశాడు. ఈ జాబితాలో మహీ 8వ స్థానంలో ఉండగా.. 5878 రన్స్‌తో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత సురేశ్ రైనా(5368), డేవిడ్ వార్నర్(5254), రోహిత్ శర్మ(5230), శిఖర్ ధావన్(5,197), ఏబీ డివిలియర్స్(4849), క్రిస్ గేల్(4772) మహీ కన్నా ముందున్నారు.

Story first published: Tuesday, April 6, 2021, 13:30 [IST]
Other articles published on Apr 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+