Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాక్ అభిమాని ఎటకారం.. గూగుల్ సీఈవో వ్యంగ్యాస్త్రం! అన్ని మూసుకున్న...!

Google CEO Sundar Pichai shuts down Pakistan troll with epic reply over India beat pakistan in T20 WC 2022

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ప్రపంచం మెచ్చిన పాక్ పేసర్లను పరేషాన్ చేస్తూ.. ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి గర్జించాడు. ఓటమి తప్పదని భావించిన మ్యాచ్‌లో తనకే సాధ్యమైన ఆటతో దేశ ప్రజలకు ఒక రోజు ముందుగానే దీపావళీ సంబరాన్ని తీసుకొచ్చాడు. దాంతో యావత్ దేశం ఈ విజయం పట్ల ఉప్పొంగిపోయింది. సంతోషం పట్టలేక.. దీవాళీకి కొనుక్కున్న క్రాకర్స్‌ను ముందే కాల్చేసింది. సోషల్ మీడియాలో ఎవర్ని కదిలించినా.. భారత్-పాక్ ముచ్చటే.. కోహ్లీపై ప్రశంసలే.

భారత్ విజయంతో దివాళీ..

చివరకు గూగుల్ సీఈవో సుదర్ పిచాయ్ కూడా ఈ మ్యాచ్‌ను ఆస్వాదించానని ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన విజయంతోనే తన దీవాళీ సంబరాలు మొదలయ్యాయని ట్వీట్ చేశాడు.'హ్యపీ దివాళీ. ఈ గొప్ప సమయాన్ని అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మ్యాచ్‌ చివరి మూడు ఓవర్లు మరోసారి చూడటం ద్వారా నేను దీపావళి సంబరాలు చేసుకున్నాను. అద్భుతమైన ఆట, అద్భుతమైన ప్రదర్శన'అని సుందర్ పిచాయ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022 అనే హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు.

పాక్ నెటిజన్ ఎటకారం..

ఈ ట్వీట్‌‌ను చూసి సహించలేకపోయిన ముహమ్మద్ షహ్‌జైబ్ అనే పాకిస్థాన్ నెటిజన్.. 'మీరు తొలి మూడు ఓవర్లు కూడా చూడాల్సింది'అని ఎటకారంగా బదులిచ్చాడు. తొలి మూడు ఓవర్లలో పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా.. రాహుల్ 4 పరుగులకే ఔటయ్యాడు. దీన్ని ఉద్దేశించే సదరు పాకిస్థానీ అలా ట్వీట్ చేశాడు. అతని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న సుందర్ పిచాయ్.. అది కూడా చేశాను. భువీ, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ భారత బౌలర్లను ప్రశంసించాడు.

గూగుల్ సీఈవోనా.. మజాకా?

గూగుల్ సీఈవోనా.. మజాకా?

నేను చెప్పింది టీమిండియా ఇన్నింగ్స్ అంటూ షహ్‌జైబ్ బదులిచ్చినా.. గూగుల్ సీఈవో బదులివ్వలేదు. ఇక సుందర్ పిచాయ్ కౌంటర్‌కు భారత నెటిజన్లు ఫిదా అయ్యారు. ట్రోలర్స్‌కే అమ్మ మొగుడిలా ఉన్నాడని సంతోషం వ్యక్తం చేశారు. సుందర్ పిచాయ్ సమయస్ఫూర్తిని కొందరు పొగడగా.. మరి కొందరు మాత్రం.. అంతటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్ చేశాడు. ఆయన రిప్లయ్ ఇచ్చిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి లామినేట్ చేయించి నీ లివింగ్ రూమ్‌లో ఉంచుకో. అది కోట్లాది రూపాయలు విలువ చేసే పెయింటింగ్ లాంటిది. ఇంకా ఏడవటం ఆపేయ్.. గూగుల్ సీఈవో నీకు రిప్లయ్ ఇచ్చాడు భయ్యా.. అంటూ మరికొందరు పాకిస్థానీకి సూచిస్తున్నారు. ప్రస్తుతం సుందర్ పిచాయ్ కౌంటర్‌కు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Monday, October 24, 2022, 15:23 [IST]
Other articles published on Oct 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+