జైస్వాల్.. సిగ్గుపడకుండా రోహిత్ శర్మకు చెప్పు: అనిల్ కుంబ్లే
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించాడు. అతని బ్యాటింగ్‌ను మెచ్చుకున్న అనిల్ కుంబ్లే.. బౌలింగ్ కూడా చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రతీ మ్యాచ్‌లో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసేలా కెప్టెన్ రోహిత్ శర్మను రిక్వెస్ట్ చేయమని సూచించాడు. సహజ సిద్దంగా వచ్చిన లెగ్ స్పిన్ బౌలింగ్‌ను కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ ఆపవద్దని సలహా ఇచ్చాడు.
రాజ్‌కోట్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో రోహిత్ సేన ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ విధ్వంసకర డబుల్ సెంచరీ బాదాడు. 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 216 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి 158 బంతుల్లో అజేయంగా 172 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్‌తో చిట్ చాట్ చేసిన అనిల్ కుంబ్లే.. బౌలింగ్ చేయమని సలహా ఇచ్చాడు.
'యశస్వి అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. కానీ నీలో నేను గమనించిన ఒక విషయం ఉంది. నువ్వు సహజ సిద్దంగా లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగలవు. దానిని అలాగే కొనసాగించు. ఎట్టి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం ఆపకు. ఎందుకంటే ఈ బౌలింగ్ ఎప్పుడు ఉపయోగపడుతోందో తెలియదు. నీకు వెన్ను నొప్పి ఉందనే విషయం తెలుసు. కానీ ఆ సమస్యపై నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు బౌలింగ్ చేయడం పెద్ద సమస్యేమి కాదు. కాబట్టి రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తానని చెప్పు.'అని అనిల్ కుంబ్లే సలహా ఇచ్చాడు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయం చెప్పాడని, ఈ సిరీస్‌లో ఎప్పుడైనా బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలన్నాడని కుంబ్లేకు బదులిచ్చాడు. బౌలింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలని కూడా చెప్పాడని కుంబ్లేకు వివరించాడు. 'నాకు బౌలింగ్ చేయడం చాలా ఇష్టం. రోహిత్ భాయ్ బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలని చెప్పాడు. నేను కూడా ఎప్పుడూ బంతి ఇచ్చినా బౌలింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాను'అని యశస్వి చెప్పుకొచ్చాడు.
భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(5/41) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు కుప్పకూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications