Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Warner-Johnson: మామ మందేసి మాట్లాడుకోండి: డివిలియర్స్

Warner-Johnson: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ జాన్సన్ మధ్య నెలకొన్న మాటల యుద్దంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో స్పందించాడు. అహం పక్కనపెట్టి మందేసి మాట్లాడుకోవాలని సూచించాడు.

సొంత గడ్డపై ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌తో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. దాంతో అతన్ని కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేసారు. ఘనంగా వీడ్కోలు పలకేందుకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది.

 Go for Drink: Ab De Villiers on David Warner-Mitchell Johnson spat

అయితే డేవిడ్ వార్నర్‌కు ఘన వీడ్కోలు ఎందుకని, అతను ఏమైనా హీరోనా? అంటూ మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు. 'అసలు డేవిడ్ వార్నర్‌ను ఎందుకు ఎంపిక చేశారు? నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతనికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద వివాదాల్లో ఒకటైన బాల్ టాంపరింగ్‌లో ప్రధాన పాత్ర పోషించిన వార్నర్‌కు హీరోలా వీడ్కోలు పలకడం ఏంటి?" అని మిచెల్ జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆసీస్‌కు చెందిన ప్రస్తుత, మాజీ క్రికెటర్లు మిచెల్ జాన్సన్‌‌కు గట్టి కౌంటరిచ్చారు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా హీరోనని, అతను జట్టుకు ఎంతో సేవలు చేశాడని ఉస్మాన్ ఖవాజా అన్నాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓపెనర్‌గా కొన్నేళ్లనుంచి సేవలు అందిస్తున్న డేవిడ్ వార్నర్‌కు ఘనమైన వీడ్కోలు కచ్చితంగా అవసరమేనని, అందులో అనుమానం లేదని అని జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు.

 Go for Drink: Ab De Villiers on David Warner-Mitchell Johnson spat

ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్.. బహిరంగంగా విమర్శలు చేసుకునే బదులు.. మందేసి మాట్లాడుకోవాలని, ఇద్దరి మధ్య ఉన్న విభేదాలకు ముగింపు పలకాలని సూచించాడు.

'ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్నప్పుడు నేను వార్నర్‌తో కలిసి ఆడాను. కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజం. మిచెల్ జాన్సెన్, వార్నర్ మధ్య కూడా ఏదో గొడవ జరిగినట్లుంది. ఇలాంటి చిన్న విషయాలకు ఒకరిపై మరొకరు పగ పెంచుకోవాల్సిన అవసరం లేదు.

 Go for Drink: Ab De Villiers on David Warner-Mitchell Johnson spat

ఇద్దరూ ఇలా బహిరంగంగా విమర్శించుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫోన్ చేసి మందు తాగేందుకు ఆహ్వానించుకోండి. మందేస్తూ సమస్యను పరిష్కరించుకోండి. ఇలాంటి పని చేసేందుకు డేవిడ్ వార్నర్ ఏ మాత్రం వెనుకాడడు. సీనియర్ ఆటగాడితో మాట్లాడటానికి అతను ఏ మాత్రం భయపడడు.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, December 6, 2023, 16:44 [IST]
Other articles published on Dec 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+