ఒడియమ్మ బంటీ.. ఇదేం క్యాచ్ రా!(వీడియో)
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2026 టోర్నీలో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్లేన్ ఫిలిప్స్ మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసంతో ఔరా అనిపించాడు.
సోమవారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌పై సింగిల్ హ్యాండ్‌తో కనీవినీ ఎరుగని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ కోసం గ్లేన్ ఫిలిప్స్.. పెద్దగా ఎఫర్ట్ కూడా పెట్టలేదు. బంతి వేగానికి తగ్గట్లు స్పందించి సింగిల్ హ్యాండ్‌తో పట్టేసాడు. ఈ క్యాచ్‌ను చూసిన కామెంటేటర్లు వాటే క్యాచ్ అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లు కూడా అవాక్కయ్యారు.
కెరీర్‌లోనే బెస్ట్ క్యాచ్..
గ్లేన్ ఫిలిప్స్ క్యాచ్‌కు సునీల్ నరైన్(1) బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా పేసర్ డ్వెన్ ప్రిటోరియస్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని సునీల్ నరైన్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. బంతి సిక్సర్‌గా దూసుకెళ్లింది. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్.. బంతి వేగానికి తగ్గట్లు వెనక్కి జరిగి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టాడు.

ఆ వెంటనే ఫిలిప్స్ క్యాచ్ అందుకున్నానా? అని స్టన్నింగ్ లుక్ ఇచ్చాడు. ఈ క్యాచ్ పట్టడంపై తానే నమ్మలేకపోయాడు. దాంతో సిక్సర్ కాస్త క్యాచ్ ఔట్‌గా మారింది. ఫిట్‌నెస్ బాప్ అయిన గ్లేన్ ఫిలిప్స్ ఇప్పటికే ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకున్నాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ క్యాచ్ పట్టలేదు. ఇది అతని కెరీర్‌లోనూ ది బెస్ట్ క్యాచ్‌గా నిలిచిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ట్రిన్‌బాగోకు తప్పని ఓటమి..
ఈ మ్యాచ్‌లో గ్లేన్ ఫిలిప్స్ టీమ్ గయానా అమెజాన్ వారియర్స్ డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించి ఆడించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 16 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది.
షిమ్రాన్ హెట్‌మైర్(43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. అనంతరం డీఎల్‌ఎస్ ప్రకారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని 182 పరుగులుగా నిర్ణయించగా.. ఆ జట్టు 16 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. అలెక్స్ హేల్స్(55), నికోలస్ పూరన్(43) రాణించినా ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

