Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేందయ్యా ఫిలిప్స్.. ఇది మేం ఏడ చూడలే!(వీడియో)

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ గాగుల్స్‌తో బ్యాటింగ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా బుధవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ఫిలిప్స్ బ్లాక్ గాగుల్స్‌తో బ్యాటింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

తొలి రోజు ఆట చివరి సెషన్‌లో సైట్‌స్క్రీన్‌పై సన్‌లైట్ పడటంతో ఫిలిప్స్ ఇబ్బంది పడ్డాడు. దాంతో 67వ ఓవర్‌లో సన్‌గ్లాసెస్ తెప్పించుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఇంగ్లండ్ అరంగేట్ర బౌలర్ సోనీ బేకర్ లూజ్ డెలివరీలను అలవోకగా ఆడిన ఫిలిప్స్‌కు జోఫ్రా ఆర్చర్ రూపంలో గట్టి సవాల్ ఎదురైంది.

తిక్క కుదర్చిన జోఫ్రా ఆర్చర్..

నాలుగో స్పెల్‌ వేసేందుకు వచ్చిన ఆర్చర్ రాకాసి బౌన్సర్లతో ఫిలిప్స్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. అతను వేసిన తొలి బంతి భుజానికి బలంగా తాకగా.. మరో బంతి అతని తలపైకి దూసుకొచ్చింది. దాన్ని తప్పించుకునే క్రమంలో ఫిలిప్స్ కిందపడిపోయాడు. వెంటనే లేచి న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్‌వైపు తాను సేఫ్ అంటూ థంప్స్ అప్ సైగలు చేశాడు.

టీమిండియా నుంచి అతన్ని తప్పించలేరు: సునీల్ గవాస్కర్

టీమిండియా నుంచి అతన్ని తప్పించలేరు: సునీల్ గవాస్కర్
Stylish Glenn Phillips Sports Sunglasses to Defy Jofra Archer s Fiery Fast-Bowling Barrage during ENG vs NZ 2nd Test
Photo Credit: X (twitter)

దాంతో న్యూజిలాండ్ ఆటగాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఫిలిప్స్ గాగుల్స్ బ్యాటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదేందయ్యా ఫిలిప్స్.. మేం ఏడ చూడలే'అని ఒకరంటే.. ఈ ఎక్స్2ట్రాలకు ఏం తక్కవ లేదని మరొకరు సెటైర్లు పేల్చారు.

ఫిలిప్స్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 107 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన గ్లేన్ ఫిలిప్స్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. డారిల్ మిచెల్(44), టామ్ బ్లండెల్(51), కైల్ జెమీసన్‌(41)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్‌ను మాథ్యూ ఫిషర్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మాథ్యూ ఫిషర్, సోనీ బేకర్ రెండేసి వికెట్లు తీయగా.. జాకోబ్ బెతెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్‌కు ఒక వికెట్ దక్కింది.

IPL 2027 కాస్త ముందుగానే.. మ్యాచ్‌ల పెంపు కష్టమే: బీసీసీఐ సెక్రటరీ

IPL 2027 కాస్త ముందుగానే.. మ్యాచ్‌ల పెంపు కష్టమే: బీసీసీఐ సెక్రటరీ
Story first published: Thursday, June 18, 2026, 17:23 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+