Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా చేస్తేనే జస్‌ప్రీత్ బుమ్రా ఆడగలడు: ఆసీస్ దిగ్గజం

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా.. సుదీర్ఘ కాలంపాటు క్రికెట్ ఆడాలంటే ఏదో ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ సూచించాడు. విలక్షణమైన అతని బౌలింగ్ యాక్షన్ వెన్నుపై ఒత్తిడిని పెంచుతోందని, తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

గతేడాది ఆసియాకప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ నెలలో ఐర్లాండ్ పర్యటనతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీమిండియాకు జస్‌ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రాణించాలంటే బుమ్రా రాణించడం కీలకం.

Jasprit Bumrah

ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. బుమ్రా గాయం, ఫిట్‌నెస్‌పై స్పందించిన మెక్‌గ్రాత్ అతనికి విలువైన సలహా ఇచ్చాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియా ప్రధాన పేసర్. అతని గణంకాలు.. వికెట్లే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. విభిన్నమైన అతని బౌలింగ్ శైలికి నేను పెద్ద అభిమానిని. అయితే ఆ బౌలింగ్ యాక్షనే అతన్ని ఇబ్బంది పెడుతోంది.

అతని శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. జస్‌ప్రీత్ బుమ్రా సుదీర్ఘ కాలం పాటు ఆడాలంటే ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అంతకు మించి మానసికంగా చాలా బలంగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ షెడ్యూల్, ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లు తీరికలేని క్రికెట్ ఆడుతున్నారు. దాంతో పేసర్లు తరుచూ గాయపడుతున్నారు.

Glenn McGrath

బుమ్రాలాంటి విలక్షణమైన యాక్షన్ కలిగిన ఆటగాళ్లు అయితే మరింత ఎక్కువగా గాయపడుతున్నారు. కాబట్టి అతను ఏదో ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇస్తే వర్క్‌లోడ్ తగ్గించుకోవచ్చు. తద్వారా సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంటుంది. అదే మూడు ఫార్మాట్లలో కొనసాగితే శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, వాల్ష్ వంటి బౌలర్లు సుదీర్ఘ కాలం కెరీర్‌ను కొనసాగించారు. వారికి తమ శరీరాన్ని ఎలా మెయింటెన్ చేయాలో బాగా తెలుసు. వీళ్లంతా ఒక సమయం ధాటిన తర్వాత టెస్ట్ ఫార్మాట్‌పైన మాత్రమే ఫోకస్ పెట్టారు. అందుకే అన్ని సంవత్సరాలు ఆడగలిగారు. నా బౌలింగ్ యాక్షన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. శరీరంపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకునేవాడిని. ఒకవేళ గాయమైనా చాలా త్వరగా కోలుకునేవాడిని. 'అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 5, 2023, 17:59 [IST]
Other articles published on Aug 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+