AUS vs SA: మ్యాక్సీ మామ విధ్వంసం..ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఆసీస్
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరి టీ20లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది.
బ్రెవిస్(26 బంతుల్లో ఫోర్,6 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(26 బంతుల్లో 3 ఫోర్లతో 38 నాటౌట్), రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లతో 25) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/31) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/30), ఆడమ్ జంపా(2/24) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/31) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/30), ఆడమ్ జంపా(2/24) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి గెలుపొందింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు మిచెల్ మార్ష్(37 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(2/32), క్వెన్ మఫకా(2/36) రెండేసి వికెట్లు తీయగా.. కోర్బిన్ బోచ్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు.
గెలిపించిన మ్యాక్సీ..
చివరి 12 బంతుల్లో ఆసీస్ విజయానికి 12 పరుగుల అవసరం కాగా.. కోర్బిన్ బోచ్ సంచలన బౌలింగ్‌తో ఉత్కంఠ రేపాడు. 19వ ఓవర్‌లో బెన్ ద్వార్షాయిస్(1), నాథన్ ఎల్లిస్(0)లను ఔట్ చేసిన బోచ్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరమై మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ లుంగి ఎంగిడి వేసిన ఆఖరి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ తొలి రెండు బంతుల్లోనే (2, 4 ) 6 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి రెండు బంతులు డాట్ కావడంతో చివరి రెండు బంతులకు నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మ్యాక్స్ బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications