న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్.. ఆ కట్టు.. బొట్టు సూపరో సూపర్!!

Glenn Maxwell Wears Ethnic Indian For Engagement To Vini Raman Pics Viral

ముంబై: ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ భారత సంతతికి చెందిన విని రామన్‌తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి భారత సంప్రదాయ ప్రకారం అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకలో మ్యాక్స్‌వెల్,అతని కుటుంబ సభ్యులు తళక్కుమన్నారు. కట్టు.. బొట్టుతో ఆకట్టుకున్నారు.

మైదానంలో పసుపు రంగు ఆస్ట్రేలియా జెర్సీల్లో నిత్యం కనిపించే మాక్సీ ఈ వేడుకలో షేర్వాణి ధరించాడు. నుదుటన తిలకం సైతం దిద్దుకున్నాడు. ఎంతో అందంగా కనిపించాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులు సైతం చీర, లెహెంగా వంటి సంప్రదాయ దుస్తులే ధరించడం ప్రత్యేకం. ఈ ఫొటోలను విని రామన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ ఫొటోలకు ఆమె 'గత రాత్రి మేం భారత సంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక పెళ్లి ఎలా జరుగుతుందో మాక్సీకి చిన్న టీజర్‌ చూపించాను. మా రెండు కుటుంబాలు, మిత్రులు ఈ వేడుకను చూసి ఆనందించారు' అని క్యాప్షన్‌గా పేర్కొంది.

మాక్స్‌వెల్‌, వినీ రామన్‌ చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి వేడుకలు, షికార్లకు వేళ్లేవారు. ఆ మధ్య మాక్సీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నానని క్రికెట్‌కు విరామం తీసుకున్నాడు. అతడికి విరామం అవసరమని మొదట గుర్తించింది కూడా విని రామనేనని అతనే స్వయంగా వెల్లడించాడు.

Story first published: Tuesday, March 17, 2020, 21:10 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X