
ఇతర గ్రహం నుంచి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్.. సూర్య ఆట మాటలకు అందడం లేదని.. అతడు వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టుగా ఆడుతున్నాడని కొనియాడాడు. అంతేగాక అతనే గనక బిగ్ బాష్ లీగ్ లోకి వస్తే తమ క్రికెట్ బోర్డుకు తిప్పలు తప్పవని చమత్కరించాడు. 'అసలు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఉందని నాకు తెలియదు. కానీ ఎందుకో నేను రిమోట్ మారుస్తుంటే టీవీలో స్కోరుబోర్డు కనబడింది. ఆ స్కోరు బోర్డు చూడగానే నా మైండ్ బ్లాంక్ అయింది. నేను వెంటనే దానిని స్క్రీన్ షాట్ తీసి ఆరోన్ ఫించ్‌కు పంపించాను.

సూర్య ఆట చూసి సిగ్గేసింది..
ఫించ్ తో నేను.. 'అసలేం జరుగుతోంది.. సూర్య వేరే ప్లానెట్ నుంచి వచ్చాడా..? అలా బ్యాటింగ్ చేస్తున్నాడేంటి..? అందరి స్కోర్లు చూడు. ఒక్క సూర్య స్కోరు చూడు'అని చెప్పా. ఆ మ్యాచ్ ముగిశాక నేను రిప్లే చూశా. ఆ ఇన్నింగ్స్ చూశాక నాకే ఏదోలా అనిపించింది. మేమంతా ఇలా ఎందుకు ఆడలేకపోతున్నామని కాస్త సిగ్గుగా ఫీలయ్యా. సూర్య ఆట మాములుగా లేదు. మేము అతడి దరిదాపుల్లోకి కూడా ఉండం.

మా దగ్గర అన్ని డబ్బుల్లేవ్..
ఇదే చర్చలో మరి సూర్య గనక బిగ్ బాష్ లీగ్ లోకి వస్తే ఎలా..? అని ప్రశ్నించగా దానికి మ్యాక్సీ సరదాగా సమాధానం చెప్పాడు. 'సారీ. మా దగ్గర అన్ని డబ్బుల్లేవు. అసలు ఆ అవకాశమే లేదు. ఒకవేళ సూర్య గనక బీబీఎల్ లో ఆడాల్సి వస్తే క్రికెట్ ఆస్ట్రేలియా తన కాంట్రాక్టు ఉన్న ప్లేయర్లందరినీ వదులుకోవాలి.'అని ఫన్నీగా చెప్పాడు. ఏడాదికాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య.. ఈ క్యాలెండర్ ఈయర్ లో టీ20 ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు ధాటిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.

వన్డే సిరీస్ కోసం..
టీ20 సిరీస్ ముగియడంతో శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే సిరీస్ ఆడేందుకు సూర్య రెడీ అవుతున్నాడు. మరోసారి టీ20 ర్యాంకింగ్స్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్న సూర్య.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. ఇక స్నేహితుడి బర్త్‌డే పార్టీలో కాలు విరగ్గొట్టుకున్న మ్యాక్స్‌వెల్ ఆటకు దూరమై రెస్ట్ తీసుకుంటున్నాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి సుమారు 3 నెలల సమయం పట్టనుంది.


Click it and Unblock the Notifications












