For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ లాంటిదే ఐపీఎల్.. లీగ్‌లో ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా: ఆసీస్ స్టార్ ప్లేయర్

Glenn Maxwell says IPL is similar to a ICC World Cup

సిడ్నీ: ఐసీసీ ప్రపంచకప్‌ లాంటిదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీలో ఆడతారు కాబట్టి ఐపీఎల్‌ కూడా ప్రపంచకప్‌ లాంటిదేనని అన్నాడు. టోర్నీ ఎక్కడ జరిగినా తాను ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మాక్స్‌వెల్ వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో మాక్స్‌వెల్ ఇప్పటివరకు 7 టెస్టుల్లో, 110 వన్డేల్లో, 61 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ప్రపంచకప్‌ లాంటిదే ఐపీఎల్:

ప్రపంచకప్‌ లాంటిదే ఐపీఎల్:

తాజాగా గ్లెన్ మాక్స్‌వెల్ 'ఫాక్స్ స్పోర్ట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'చాలా మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. విమాన ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ ఇబ్బందులు లేకపోతే టోర్నీలో ఆడేందుకు నాకేమీ అభ్యంతరాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడతారు కాబట్టి ఐపీఎల్‌ కూడా ఐసీసీ ప్రపంచకప్‌ లాంటిదే. ఐపీఎల్‌‌‌లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తా' అని మాక్స్‌వెల్ తెలిపాడు.

ఐపీఎల్-12‌‌కి దూరం:

ఐపీఎల్-12‌‌కి దూరం:

2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రం 2012లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఇన్నింగ్స్‌లలో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మాక్స్‌వెల్ ఇప్పటి వరకూ ఐపీఎల్ 69 మ్యాచ్‌లాడి 1,397 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 16 వికెట్లు పడగొట్టాడు. అయితే వ్యక్తిగత కారణాలతో (మానసిక సమస్యలు) ఐపీఎల్-12‌‌కి దూరంగా ఉన్నాడు. తాత్కాలిక విరామం అనంతరం బిగ్ బాష్ లీగ్ ఆడి దుమ్ములేపాడు. ఆపై కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉన్నాడు. బయో సెక్యూర్‌ వాతావరణంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 26 మందితో కూడిన ప్రాథమిక ఆస్ట్రేలియా జట్టుని తాజాగా ప్రకటించింది. అందులో మ్యాక్సీ కూడా ఉన్నాడు.

వేలంలో భారీ ధర:

వేలంలో భారీ ధర:

గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న మాక్స్‌వెల్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

 టీ20 ప్రపంచకప్ వాయిదా:

టీ20 ప్రపంచకప్ వాయిదా:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో.. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు మార్గం సుగమమైంది. ఇక యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. అయితే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెళ్ళలేదు. భారత ప్రభుత్వ అనుమతి రాగానే.. లీగ్ షెడ్యూల్‌తో సహా అన్ని విషయాలపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు.

యూఏఈలో ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుంది.. కారణం చెప్పిన ఆకాశ్‌ చోప్రా!!

Story first published: Wednesday, July 22, 2020, 18:15 [IST]
Other articles published on Jul 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+