Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Glenn Maxwell: వచ్చాడయ్యో మ్యాక్సీ.. టైటిల్ ఆశలతో పులకించిపోతుంది ఆర్‌సీబీ!

Glenn Maxwell Brings RCB New hope Of Winning IPL 2021 tittle
Glenn Maxwell New Hope - RCB Playoffs చేరడానికి కారణం మ్యాక్సీనే | Bangalore Winning IPL 2021 Title

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) దుమ్మురేపుతోంది. యూఏఈ గడ్డపై హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. కేకేఆర్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ను ప్రారంభించిన ఆర్‌సీబీ.. చెన్నైతో చేతిలో చిత్తయింది. కానీ ఆ తర్వాత తమ తప్పిదాలను సరిదిద్దుకొని జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ..
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయాలు సాధించి టోర్నీలో ముందడుగు వేసింది. అయితే ఈ మూడు విజయాల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కీలక పాత్ర పోషించాడు. వరుసగా(57, 50 నాటౌట్, 56) మూడు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు.

మ్యాక్సీతో ఆశలు..

మ్యాక్సీతో ఆశలు..

ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో(2/23, 56) ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, పడిక్కల్ అందిస్తున్న శుభారంభంతో స్వేచ్చగా ఆడుతున్న మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై బౌలర్‌గా కూడా జట్టుకు సేవలందిస్తున్నాడు. తనదైన స్పిన్‌తో కెప్టెన్‌గా కోహ్లీ పనిని సులువు చేస్తున్నాడు. దాంతో ఆర్‌సీబీ ఈ సారి టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. గత 13 ఏళ్లుగా సాకారం కానీ కల ఈసారి నిజమయ్యేలా ఉంది. తదుపరి మ్యాచ్‌ల్లో కూడా మ్యాక్సీ ఇదే జోరును కొనసాగిస్తే ఆర్‌సీబీ టైటిల్ గెలవడం ఖాయం.

ఐదేళ్ల తర్వాత..

ఐదేళ్ల తర్వాత..

గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. ఈ సీజన్‌లో చాలా కొత్తగా కనబడుతున్నాడు. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లోనే దుమ్మురేపిన మ్యాక్సీ.. ఆర్‌సీబీ గెలిచిన 5 మ్యాచ్‌ల్లో రాణించాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే 39 రన్స్‌తో మంచి ఫామ్ కనబర్చిన మ్యాక్సీ.. సెకండ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత కేకేఆర్‌పై 78 పరుగులతో ఒంటిచేత్తో విజయాన్నందించాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ.. 5 హాఫ్ సెంచరీలతో 407 రన్స్ చేశాడు. 2014 తర్వాత ఐపీఎల్‌లో మ్యాక్సీ 400 ప్లస్ రన్స్ చేయడం ఇదే తొలిసారి. అతను చివరి సారిగా 2016లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన మాక్సీ కోల్‌కతా మ్యాచ్‌లో 68 పరుగులు చేశాడు.

ఒక్క సిక్స్ కూడా..

ఒక్క సిక్స్ కూడా..

2017లో 14 మ్యాచ్‌లు ఆడి, 310 పరుగులు చేసినా అత్యధిక స్కోరు మాత్రం 47. తర్వాతి సీజన్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. 12 మ్యాచుల్లో 169 పరుగులు చేశాడు. 2019లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో పంజాబ్ తరఫున మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. 13 మ్యాచుల్లో 108 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 32. దాంతో పంజాబ్ అతన్ని వదులుకోగా.. ఈ సీజన్ వేలంలో ఆర్‌సీబీ రూ.14.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మ్యాక్సీని ఆర్‌సీబీని తీసుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ అయితే ఆర్‌సీబీది బుద్ది తక్కువ నిర్ణయమంటు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

సొంత టీమ్‌లా..

సొంత టీమ్‌లా..

మ్యాక్సీ మాత్రం తన బ్యాట్‌తోనే ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడానికి ప్రధాన కారణం మ్యాక్సీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర ఆటగాళ్లు రాణించినా.. కీలక పాత్ర మాత్రం ఈ ఆస్ట్రేలియా స్టార్‌దే. ఏది ఏమైనప్పటికి మ్యాక్సీ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. మ్యాక్సీ ఇలానే రాణిస్తే ఆర్‌సీబీ టైటిల్ అందుకోవడం కష్టమేమి కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం.. మ్యాక్స్‌వెల్ రాణించడంపైనే ఆర్‌సీబీ విజయవకాశాలను ఆధారపడి ఉన్నాయని సీజన్ ప్రారంభానికి ముందే చెప్పాడు. అతను ఇలానే చెలరేగితే ఆర్‌సీబీ టైటిల్ గెలవడం ఖాయం!

Story first published: Monday, October 4, 2021, 9:37 [IST]
Other articles published on Oct 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+