For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: వచ్చాడయ్యో మ్యాక్సీ.. టైటిల్ ఆశలతో పులకించిపోతుంది ఆర్‌సీబీ!

Glenn Maxwell Brings RCB New hope Of Winning IPL 2021
IPL 2021 : Maxwell కమిట్‌మెంట్‌ 1st IPL Fifty in 5 Years | Ee Sala Cup Namde - RCB New Hope

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో టాపర్‌గా నిలిచింది. అయితే ఈ రెండు విజయాల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో వీరోచిత పోరాటం కనబర్చాడు. బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ.. తనశైలికి భిన్నంగా ఓపికగా ఆడుతూ కడవరకు నిలిచి ఆర్‌సీబీకి పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

 ఐదేళ్ల తర్వాత..

ఐదేళ్ల తర్వాత..

గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. ఈ సీజన్‌లో చాలా కొత్తగా కనబడుతున్నాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే 39 రన్స్‌తో మంచి ఫామ్ కనబర్చిన మ్యాక్సీ.. సెకండ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌లో ఐదేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2014లో కింగ్స్ పంజాబ్‌ తరఫున మెరుపులు మెరిపించిన ఈ ఆసీస్ స్టార్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్ చేయలేదు. అతను చివరి సారిగా 2016లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన మాక్సీ కోల్‌కతా మ్యాచ్‌లో 68 పరుగులు చేశాడు.

 ఒక్క సిక్స్ కూడా..

ఒక్క సిక్స్ కూడా..

2017లో 14 మ్యాచ్‌లు ఆడి, 310 పరుగులు చేసినా అత్యధిక స్కోరు మాత్రం 47. తర్వాతి సీజన్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. 12 మ్యాచుల్లో 169 పరుగులు చేశాడు. 2019లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. గత సీజన్‌లో పంజాబ్ తరఫున మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. 13 మ్యాచుల్లో 108 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 32. దాంతో పంజాబ్ అతన్ని వదులుకోగా.. ఈ సీజన్ వేలంలో ఆర్‌సీబీ రూ.14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మ్యాక్సీని ఆర్‌సీబీని తీసుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ అయితే ఆర్‌సీబీది బుద్ది తక్కువ నిర్ణయమంటు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

సొంత టీమ్‌లా..

సొంత టీమ్‌లా..

మ్యాక్సీ మాత్రం తన బ్యాట్‌తోనే ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే తన శైలికి భిన్నంగా బాధ్యతాయుతంగా ఆడిన మ్యాక్సీ తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు. మ్యాచ్‌ను ఫినిష్ చేయకపోయినా టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక సన్‌రైజర్స్ మ్యాచ్‌లో క్రీజులో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్న మ్యాక్సీ.. షాబాజ్‌ నదీమ్‌ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. వరుసగా 6, 4, 6 బాదేశాడు. కోహ్లీ, డివిలియర్స్‌ ఔటైనా మరో 6 ఓవర్ల వరకు క్రీజులో నిలిచాడు.

నటరాజన్ బౌలింగ్‌లో అతను కొట్టిన స్విచ్ షాట్ మ్యాచ్‌కే హైలైట్. చివరి ఓవర్లో మూడో బంతికి 2 పరుగులు తీసి 2016 తర్వాత తొలి అర్ధశతకం సాధించాడు. 40 ఇన్నింగ్స్‌‌ల తర్వాత అతను ఈ లాంఛనం అందుకోవడం గమనార్హం. మొదటి బంతి నుంచే బాదుతూ.. చివరి వరకు తీసుకెళ్లడం తనకు అలవాటు లేని పని అని మ్యాచ్ అనంతరం గ్లెన్ మాక్స్‌వెల్‌ అన్నాడు. దీన్ని బట్టే అతను ఆర్‌సీబీకి ఎంత కమిట్‌మెంట్‌తో ఆడుతున్నాడనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

మ్యాక్సీ వల్లే విజయం..

మ్యాక్సీ వల్లే విజయం..

సన్‌రైజర్స్‌తో ఆర్‌సీబీ గెలిచిందంటే అందుకు కారణం మ్యాక్సీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివర్లో బౌలర్లు రాణించినా.. అతను కడవరకు నిలవకపోయింటే ఆర్‌సీబీ 130 పరుగులు కూడా చేసేది కాదు. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లభించింది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మ్యాక్సీ ఇన్నింగ్స్ ప్రత్యేకమని కొనియాడాడు. ఏది ఏమైనప్పటికి మ్యాక్సీ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. మ్యాక్సీ ఇలానే రాణిస్తే ఆర్‌సీబీ టైటిల్ అందుకోవడం కష్టమేమి కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం.. మ్యాక్స్‌వెల్ రాణించడంపైనే ఆర్‌సీబీ విజయవకాశాలను ఆధారపడి ఉన్నాయని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందే చెప్పాడు. అతను ఇలానే తన ఫామ్ కొనసాగిస్తే ఆర్‌సీబీ తిరుగుండదు.!

Story first published: Thursday, April 15, 2021, 16:33 [IST]
Other articles published on Apr 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+