Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ అల్లుడు గ్లేన్ మాక్స్‌వెల్‌కు ఆడబిడ్డ.. పేరు ఏంటంటే..?

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, భారత అల్లుడు గ్లేన్ మాక్స్‌వెల్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి వినీ రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మాక్సీ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ కూతురికి 'మాయా మాక్స్‌వెల్'అని పేరు పెట్టారు.

Maxwell: తప్పతాగి ఆస్పత్రి పాలైన మాక్సీ.. జట్టు నుంచి తప్పించిన ఆసీస్!

Maxwell: తప్పతాగి ఆస్పత్రి పాలైన మాక్సీ.. జట్టు నుంచి తప్పించిన ఆసీస్!

తల్లి, పాప క్షేమంగా ఉన్నారని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాక్స్‌వెల్ పేర్కొన్నాడు. 'మా డ్రీమ్ గర్ల్ మాయా మాక్స్‌వెల్ వచ్చేసింది.'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. దాంతో సహచర క్రికెటర్లు, టీ20 ఫ్రాంచైజీలు, అభిమానులు మాక్స్‌వెల్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

Glenn Maxwell and Indian-Origin Wife Vini Raman Welcome Baby Girl Reveal Name in Viral Post

స్నేహం కాస్త ప్రేమగా మారి..

2013లో భారత సంతతికి చెందిన వినీ రామన్‌‌ను మాక్స్‌వెల్ తొలిసారి కలిసాడు. ఈ ఇద్దరి స్నేహం.. ప్రేమగా మారింది. 2017లో ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. 2020లో భారత సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. 2022లో వివాహ బంధంతో ఒక్కటైంది. వీరి పెళ్లి క్రైస్తవ పద్దతితో పాటు తమిళ బ్రాహ్మణ పద్దతిలో జరిగింది. తమిళ పద్దతిలో జరిగిన వివాహా వేడుకలో మాక్స్‌వెల్ సాంప్రదాయ బంగారు షేర్వానీ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ పై మ్యాక్స్ వెల్ ప్రశంసల జల్లు..!

Also Read

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ పై మ్యాక్స్ వెల్ ప్రశంసల జల్లు..!

2023లో కొడుకు..

మాక్సీ-వినీ దంపతులకు 2023లో తొలి సంతానంగా కొడుకు జన్మించాడు. అతనికి లోగాన్‌ మార్వెరిక్‌ మాక్స్‌వెల్‌ అని పేరు పెట్టారు. తాజాగా కుమార్తె జన్మించగా.. ఆమెకు మాయా మాక్స్‌వెల్‌గా నామకరణం చేశారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అయిన మాక్స్‌వెల్.. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ వన్డే‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 149 వన్డేల్లో 3990 పరుగులతో పాటు 79 వికెట్లు పడగొట్టాడు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాగెలవడంలో మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో ముంబై వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌ వన్డే ప్రపంచకప్ చరిత్రలో ది బెస్ట్‌గా నిలిచిపోయింది. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీలో అతను బెల్షాస్ట్ వోల్వ్స్ జట్టుకు కో ఓనర్‌గా.. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Thursday, August 20, 2026, 12:13 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+