Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని కోసమే శుభ్‌మన్ గిల్‌ను తప్పించాం: సూర్యకుమార్ యాదవ్

మిడిలార్డర్ బలాన్ని పెంచేందుకే శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. టాపార్డర్ వికెట్ కీపర్‌ ఇషాన్ కిషన్‌తో పాటు రింకూ సింగ్‌ కోసం గిల్‌ను తప్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, అతని క్లాస్ బ్యాటింగ్‌పై తమకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బోర్డ్ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన టీమ్ సెలెక్షన్ సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం 15 మంది సభ్యులతో కూడిన భారత టీ20 ప్రపంచకప్ జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.

శుభ్‌మన్ గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మపై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. రింకూ సింగ్ రీఎంట్రీ ఇవ్వగా.. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.

Gill Dropped for Balance Not Form Suryakumar Yadav Explains India s Middle-Order Strategy

మిడిలార్డర్ కోసమే..

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇవ్వగా.. ఇషాన్ కిషన్, రింకూ సింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'శుభ్‌మన్ గిల్ ఫామ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదు. టీమ్ కాంబినేషన్ కోసమే అతన్ని పక్కనపెట్టాల్సి వచ్చింది. టాపార్డర్‌లో మాకు ఒక వికెట్ కీపర్ కావాల్సి వచ్చింది. అంతే తప్పా శుభ్‌మన్ గిల్ ఫామ్ గురించి కాదు. అతని క్వాలిటీ మీద మాకు ఎలాంటి సందేహాలు లేవు.

అతను ఒక అద్భుతమైన ఆటగాడు. మాకు రింకూ సింగ్ అవసరం ఏర్పడింది. అలాగే వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగించాలనుకున్నాం. అందుకే రకరకాల కాంబినేషన్లకు అనుగుణంగా ఉండటానికి మేం ఫ్లెక్సిబిలిటీని కోరుకున్నాం. ఆ కారణంతోనే ఈ జట్టును ఎంచుకున్నాం. గిల్ క్లాస్ విషయంలో మాకు ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు లేవు'అని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

బ్యాటర్ సూర్యను చూస్తారు..

తన పేలవ ఫామ్‌పై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. త్వరలోనే మునపటి సూర్యను చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. 'ఈ గడ్డు కాలం చాలా కాలంగా కొనసాగుతోంది. ఆటగాళ్లందరూ తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో ఇలాంటి దశను అనుభవిస్తారు. ఈ కఠిన పరిస్థితులను ఎలా అధిగమించాలో నాకు తెలుసు. లోపాలను సరిదిద్దుకోవడానికి నాకు సమయం ఉంది. త్వరలోనే మీరు కచ్చితంగా బ్యాటర్ సూర్యను మళ్లీ చూస్తారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, December 20, 2025, 16:30 [IST]
Other articles published on Dec 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+